దేశ రాజధాని ఢిల్లీని వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. తాజాగా శుక్రవారం సాయంత్రం పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.6గా నమోదైంది.

ఒక్కసారిగా ఇల్లు, భవనాలు తీవ్రంగా కంపించడంతో ప్రజలు ప్రాణభయంతో రోడ్ల మీదకి పరుగులు తీశారు. హర్యానాలోని రోహతక్‌లో భూకంప కేంద్రాన్ని భూభౌతిక శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

కాగా మే 10 ఆదివారం కూడా ఢిల్లీలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 3.4గా నమోదైంది. గత నెలలో కూడా దేశ రాజధానిలో రెండు సార్లు భూకంపం సంభవించింది. వరుస భూకంపాలతో ఢిల్లీ వాసులు భయాందోళనలకు గురవుతున్నారు.