న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో స్వల్ప భూకంపం చోటు చేసుకుంది. రెక్టర్ స్కేల్ పై అది 2.3గా నమోదైంది. ఢిల్లీలోని నంగ్లోయి ప్రాంతంలో భూమి కంపించింది. దీంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. శుక్రవారం తెల్లవారు జామున 5.02 గంటలకు భూకంపం వచ్చినట్లు జాతీయ సీస్మోలాజీ సెంటర్ తెలిపింది. 

ఢిల్లీలోనే కాకుండా ఎన్సీఆర్ ప్రాంతంలోని నోయిడా, ఘజియాబాద్ ల్లో కూడా భూమి కంపించింది. ఈ విషయం అధికారికంగా తెలియాల్సి ఉంది. ఢిల్లీలో సంభవించిన భూకంపం వల్ల ఆస్తి, ప్రాణ నష్టాలేవీ సంభవించలేదు. 

ఢిల్లీలో ఎనిమిది రోజుల క్రితం డిసెంబర్ 17వ తేీదన స్వల్పంగా భూమి కంపించిన విషయం తెలిసిందే. ఆ భూకంపం రెక్టర్ స్కేల్ మీద 4.2గా నమోదైంది. ఆ భూకంపం కేంద్రం రాజస్థాన్ లోని ఆల్వార్ లో ఉన్నట్లు ఎర్త్ సైన్స్ మంత్రిత్వ శాఖ, జాతీయ సీస్మోలాజీ కేంద్రం చెప్పింది.