ఓ ప్రేమ జంట నడి రోడ్డుపై హద్దు మీరి ప్రవర్తించారు. బైక్ పైనే రొమాన్స్ చేసుకుంటూ రచ్చ రచ్చ చేశారు. బైక్ పై లవర్‌ను ఎదురుగా కూర్చోబెట్టుకుని పలుమార్లు కౌగిలించుకున్నారు. లిప్ కిస్సులూ ఇచ్చుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతున్నది.
జైపూర్: ప్రేమకు హద్దులు లేవంటే.. ఈ జంట ఇలా అర్థం చేసుకున్నదేమో! నడి రోడ్డుపై ఓ ప్రేమ జంట రొమాన్స్‌తో రెచ్చిపోయింది. లవర్‌ను బైక్ పై ఎదురుగా కూర్చోబెట్టుకుని రద్దీగా ఉన్న రోడ్డుపై ఆ ప్రియుడు తీసుకెళ్లాడు. బైక్ నడుస్తుండగానే వారు పలుమార్లు కౌగిలించుకున్నారు. లిప్ కిస్సులూ పెట్టుకుంటూ రచ్చ రచ్చ చేశారు. ఇందుకు సంబంధించి వీడియో వైరల్ అవుతున్నది.
లవర్‌ను బైక్ పై ఎదురుగా కూర్చోబెట్టుకుని పబ్లిక్‌గా రొమాన్స్ చేయడం ఈ మధ్య ఓ ట్రెండ్ అవుతున్నది. పలు రాష్ట్రాల్లో పలు చోట్ల ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవలే ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇలాంటి ఓ వీడియో బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా, రాజస్తాన్‌లోని జైపూర్‌కు చెందిన ఓ వీడియో తెగ వైరల్ అవుతున్నది.
Also Read: విశాఖపట్నంలో ప్రేమ జంట హల్‌చల్.. బైక్ పై కూర్చోబెట్టుకుని రొమాన్స్.. వీడియో వైరల్
రాజస్తాన్ రాజధాని జైపూర్‌లో హోలీ సంబురాలు జరుగుతున్నాయి. అంతా రంగుల్లో మునిగి తేలుతున్నారు. యువత ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఆడుకుంటున్నారు. ఇంతలో ఓ ప్రేమ జంట బైక్ పై జవహర్ సర్కిల్ వైపుగా వచ్చింది. జవహర్ సర్కిల్ సమీపంలోని బైపాస్ రోడ్డులో వాహనాలు రద్దీగా కదులుతున్నాయి. అక్కడికే ఆ ప్రేమ జంట బైక్ పై రొమాన్స్ చేసుకుంటూ వచ్చేసింది. బైక్ పైనే కౌగిలించుకుంటూ.. లిప్ లాక్‌లతో ఆ జంట అక్కడకు వచ్చేసింది. వారిని చూసిన వారంతా ముక్కున వేలేసుకున్నారు. కనీసం ఓ పది కిలోమీటర్ల మేరకు వీరి రొమాన్స్‌కు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. దీంతో వారితోపాటే రోడ్డుపై వెళ్లుతున్న ఇతర వాహనదారులు ఒకింత ఇబ్బందికి గురవ్వగా.. ఇంకొందరు ఇదేం వెర్రి అని మందలించారు.
Also Read: పట్టపగలు నడిరోడ్డుపై రెచ్చిపోయిన ప్రేమ జంట.. బైక్‌పై రొమాన్స్.. వీడియో వైరల్
ఆ బైక్ వెనుకాలే ఉన్న కారులోని ప్రయాణికులు వారిని వీడియో తీశారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇప్పుడు ఆ వీడియో తెగ వైరల్ అవుతున్నది.
