మధ్యప్రదేశ్‌లో విషాదం చోటు చేసుకుంది. కలిసి ఏడడుగులు నడవాలని, జీవితాన్ని పంచుకోవాలనుకున్న ప్రేమజంట బలవన్మరణానికి పాల్పడింది. రాష్ట్ర రాజధాని భోపాల్‌ సమీపంలోని ధమర్రా గ్రామానికి చెందిన అర్జున్ సింగ్ కుమార్తె శిల్పీ గత కొద్దిరోజులుగా కనిపించకుండా పోయింది.

ఎంత గాలించినా కూతురి జాడ లభించకపోవడంతో అర్జున్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఆమె తన స్నేహితుడితో కలిసి ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులకు సమాచారం అందింది. వీరిద్దరూ ఒకే స్టూలుపూ నిల్చొని విడివిడిగా ఉరేసుకుని బలన్మరణానికి పాల్పడ్డారు.

వీరి స్నేహితులను విచారించగా, అర్జున్, శిల్పీలు గత కొద్దిరోజులుగా సన్నిహితంగా ఉంటున్నారని తెలిపారు. మృతులిద్దరివి వేరే వేరు మతాలు కావడంతో తమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోరనే భావనతోనే వారిద్దరూ ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చిన పోలీసులు భావిస్తున్నారు.  ఘటనా స్థలంలో ఎటువంటి సూసైడ్ నోట్ లభించకపోవడంతో ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.