జయపురం: ఓ యువకుడు తన ప్రేయసిని హత్య చేశాడు. ఈ సంఘటన ఒడిశా రాష్ట్రంలోని నవరంగపూర్ జిల్లాలో గల తెంతులికుంటి పోలీసు స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. ఐదేళ్లుగా వారిద్దరు ప్రేమించుకుంటున్నారు. అయితే, ఎందుకు గొడపవ పడ్డారో తెలియదు. కానీ ప్రియుడి చేతిలో ప్రియురాలు హతమైంది. 

తన కూతురు హత్యపై మృతురాలి తల్లి సూర్యగోండ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

అంచలమ్మ గ్రామానికి చెదిన భీష్మ హరిజన్ (27) అదే గ్రామానికి చెందిన విద్యార్థిని దరణిని ప్రేమించాడు. ఇరువురుగు ఐదేళ్లుగా ప్రేమలో ఉన్నారు. లాక్ డౌన్ కారణంగా ధరణి ఊరిలో పనులకు వెళ్తూ కుటుంబానికి ఆసరా అందిస్తోంది. 

ఎప్పటిలాగే పనుల నుంచి ఇంటికి తిరిగి వస్తున్న ధరణికి హరిజన్ నుంచి పిలుపు వచ్చింది. పాఠశాల వద్దకు రావాలని ఆమెకు చెప్పాడు. అయితే, పనికి వెళ్లిన యువతి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గాలింపు జరిపారు. 

ఊళ్లోని ప్రభుత్వ పాఠశాలలో యువతి అపస్మారక స్థితిలో ఉన్న విషయాన్ని కొందరు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. దాంతో కుటుంబ సభ్యులు పాఠశాలకు చేరుకున్నారు. యువతి గొంతుపై చేతి గోళ్ల గాట్లు కనిపించాయి. దాంతో ఆమెపై హత్యాయత్నం జరిగిందనే విషయాన్ని గుర్తించింది. దాంతో ఆమెను అంబులెన్స్ లో తెంతులికుంటి ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె మరణించింది. నిందితుడి అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.