ముంబై: మహారాష్ట్రలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం కొనసాగిస్తుందనే కారణంతో అత్తింటివారు ఓ మహిళను, ఆమె ప్రియుడిని దారుణంగా హత్య చేశారు. ట్రాక్టర్ చక్రాలతో తొక్కించి హత్య చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేసారు. 

మహారాష్ట్రలోని జల్నా జిల్లాకు చెందిన మరియా అనే మహిళ (32)కు చపల్ గావ్ కు చెందిన వ్యక్తితో వివాహం జరిగింది. పదేళ్ల క్రితమే భర్త మరణించాడు. అయినప్పటికీ అత్తింట్లోనే ఉంటోంది. ఈ క్రమంలో ఆమెకు అదే గ్రామానికి చెందిన హర్భక్ భగవత్ (27)తో పరిచయం ఏర్పడి అది వివాహేతర సంబంధానికి దారితీసింది. అ విషయం తెలిసిన అత్తింటివారు ఇద్దరినీ హెచ్చరించారు. 

అయినా వారిలో మార్పు రాలేదు. పైగా మార్చి 30వ తేదీన ఇద్దరు కలిసి గుజరాత్ కు పారిపోయారు. దాంతో మరియా కుటుంబం ఫిర్యాదుతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని గాలింపు చర్యలు చేపట్టారు. ఏప్రిల్ 22వ తేదీన వారి అచూకీ తెలుసుకుని పోలీసులు వారిని మరాహాష్ట్రకు తీసుకుని వచ్చారు. 

దాంతో వారిద్దరు గ్రామంలోనే సహజీవనం సాగించడం ప్రారంభించారు. దాంతో తీవ్ర ఆగ్రహానికి గురైన మరియా మామ బాత్వెల్  సంపత్ లాల్జరే, అతని కుమారుడు వికాస్ లాల్జరే వారిని అంతమొందించాలనే ఆలోచన చేశారు. 

అక్టోబర్ 28వ తేదీన మరియా, భగవత్ మోటార్ సైకిల్ మీద పక్కూరుకి వెళ్తుండగా, వారిపై వాళ్ల మీదకు ఎక్కించారు. దాంతో టీర్ల కింద పడడంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రికి తీసుకుని వెళ్లేలోగానే వారు మరణించారు. దీనిపై భగవత్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్తను, మరియాను వికాస్, సంపత్ కావాలనే హత్య చేశారని ఆరోపించింది. దీంతో పోలీసులు నిందితులను అరెస్టు చేశారు.