తన కళ్లేదుటే ప్రేమించిన అమ్మాయి దారుణంగా గ్యాంగ్‌రేప్‌కు గురికావడంతో మనస్తాపం చెందిన ప్రియుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

తన కళ్లేదుటే ప్రేమించిన అమ్మాయి దారుణంగా గ్యాంగ్‌రేప్‌కు గురికావడంతో మనస్తాపం చెందిన ప్రియుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా జిల్లా కటోఘోరో పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన సవాన్ సాయి, అదే గ్రామానికి చెందిన యువతి గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు.

అయితే రెండు రోజుల క్రితం సాయి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ప్రియురాలిని విచారణ నిమిత్తం పోలీసులు ప్రశ్నించగా దారుణం వెలుగులోకి వచ్చింది. ఈ నెల 1 సాయంత్రం తాను, సాయి ఓ పాఠశాల వద్ద కూర్చొన్నామని... ఆ సమయంలో ఈశ్వర్ దాస్, ఖేమ్ కన్వర్ అనే ఇద్దరు యువకులు వచ్చి సాయితో గొడవ పడ్డారని వివరించింది.

అనంతరం సాయి కళ్లెదుటే తనపై ఇద్దరు అత్యాచారానికి పాల్పడ్డారని తెలిపింది. ఈ సంఘటన గురించి సదరు యువకులు గ్రామంలోని కొందరికి చెప్పారు... దీనిని అవమానంగా భావించిన సాయి ఆత్మహత్యకు పాల్పడి వుండవచ్చని యువతి తెలిపింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు అత్యాచారానికి పాల్పడిన యువకులను అదుపులోకి తీసుకున్నారు.