తమిళనాడు, చెన్నై లో దారుణం జరిగింది. వివాహేతర సంబంధం ఓ మహిళ ప్రాణాలమీదికి తెచ్చింది. ఓ వ్యక్తిని హంతకుడిగా మార్చింది. టీ. నగర్ లో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. 

తమిళనాడు, చెన్నై లో దారుణం జరిగింది. వివాహేతర సంబంధం ఓ మహిళ ప్రాణాలమీదికి తెచ్చింది. ఓ వ్యక్తిని హంతకుడిగా మార్చింది. టీ. నగర్ లో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

చీరతో గొంతు బిగించి ప్రియురాలిని హతమార్చిన నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. చెన్నై రెడ్ హిల్స్, గాంధీనగర్ చెందిన నారాయణన్ (40) కట్టడ కార్మికుడు, భార్య మోహన (36). ఇద్దరు కుమారులు ఉన్నారు. 

అదే ప్రాంతానికి చెందిన సెక్యూరిటీ గార్డు దాస్ తో మోహనకు వివాహేతర సంబంధం ఏర్పడింది. శనివారం సాయంత్రం మోహన, దాస్ మధ్య వాగ్వాదం ఏర్పడింది.

దీంతో ఆగ్రహించిన దాస్ ఇంటి తలుపులు మూసి వేగంగా బయలుదేరాడు. అతను కోపంతో వెళ్లడం చూసిన ఇరుగు పొరుగువారు అనుమానంతో చోళవారం పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి తలుపులు తెరిచి లోపలికెళ్లి చూడగా.. చీరతో గొంతు బిగించి.. మోహన హత్య చేయబడి కనిపించింది. 

వెంటనే పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం స్టాన్లీ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి పరారీలో ఉన్న దాస్ కోసం గాలిస్తున్నారు.