Asianet News TeluguAsianet News Telugu

భర్త వదిలేశాడు.. ప్రేమించిన మరిది. చంపి పొలంలో పాతిపెట్టాడు.. ఉత్తరప్రదేశ్ లో దారుణం..

ఈ కోవలోకి వచ్చే ఘటనే uttar pradesh లో చోటు చేసుకుంది.  ప్రియురాలిని హత్య చేసిన ఒక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు.  ఈ ఘటన ఛజలత్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.  ఈ ప్రాంతంలో రెండు రోజుల క్రితం ఒక మహిళ మృతదేహం  పొలంలో పాతిపెట్టిన  స్థితిలో కనిపించింది.

love with husband brother women murdered and buried in the field in uttar pradesh
Author
Hyderabad, First Published Oct 13, 2021, 11:08 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

ఉత్తరప్రదేశ్ : ప్రేమ పేరుతో మోసపోయిన, మోసపోతున్న మహిళల సంఖ్య దేశంలో అధికంగానే ఉంటుంది. కట్టుకున్న భర్త కడతేర్చడం, నమ్మిన ప్రియుడు మోసం చేయడం..లాంటి ఘటనలు రోజూ వినిపిస్తూనే ఉన్నాయి. బాలికలు, యువతులతో పాటు వృద్ధులనూ వదిలిపెట్టని కామాంధుల వికృత చేష్టలూ గగుర్పొడుస్తున్నాయి. ప్రేమించి, సహజీవనం చేసి.. చివరకి పెళ్లి మాటెత్తితే మట్టు బెడుతున్న సంఘటనలు సర్వసాధారణం అయిపోతున్నాయి. 

ఈ కోవలోకి వచ్చే ఘటనే uttar pradesh లో చోటు చేసుకుంది.  ప్రియురాలిని హత్య చేసిన ఒక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు.  ఈ ఘటన ఛజలత్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.  ఈ ప్రాంతంలో రెండు రోజుల క్రితం ఒక మహిళ మృతదేహం  పొలంలో పాతిపెట్టిన  స్థితిలో కనిపించింది.

గ్రామస్థులు అందించిన సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని వెలికితీశారు. పోస్టుమార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసు గురించి పోలీసులు మాట్లాడుతూ మృతురాలిని ఉత్తరాఖండ్ లోని రుద్రపూర్ కు చెందిన ashadeviగా గుర్తించామని తెలిపారు.

ఆమెకు మురాదాబాద్ కు చెందిన గజరాజు తో వివాహం అయింది.  18 ఏళ్ల క్రితమే ఆమెను గజరాజ్ విడిచిపెట్టేశాడు.  ఆతర్వాత గజరాజు కు వరుసకు సోదరుడైన Satpal, ఆశా దేవికి love affair ఉంది. ఈ ప్రేమవ్యవహారంతో వారిద్దరూ కొద్దికాలం కలిసి సహజీవనం చేశారు. ఈ క్రమంలో ఆశాదేవి తనను వివాహం చేసుకోవాలని సత్పాల్ పై ఒత్తిడి తీసుకు రాసాగింది.

అలాగే సత్పాల్ పేరిట ఉన్న భూమిని తన పేరుమీద రాయాలని డిమాండ్ చేసింది ఈ నేపథ్యంలో సత్పాల్ తన ప్రియురాలు ఆశాదేవిని murder చేసి శవాన్ని పొలాల మధ్యలో పాతి పెట్టాడు. ఆశాదేవి కుమారుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు..  సత్పాల్‌పైకేసు నమోదు చేసి జైలుకు తరలించారు.  పోలీసుల విచారణలో తాను చేసిన నేరాన్ని సత్పాల్ ఒప్పుకున్నాడు. ఆమెను హత్య చేయడానికి వాడిన ఆయుధాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

మైనర్ బాలిక మీద రెండేళ్లుగా వృద్ధుడి అత్యాచారం.. విషయం తెలియడంతో....

దళిత మహిళపై గ్యాంగ్ రేప్..

కాగా, ఉత్తరప్రదేశ్ లోనే మరో దారుణం చోటు చేసుకుంది. యూపీలోని నోయిడా సమీపంలోని జేవర్ ప్రాంతంలో దళిత మహిళపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆదివారం ఉదయం గ్రామ సమీపంలోని అడవిలో పశువుల మేత కోసం వెళ్లినప్పుడు ఈ ఘోరం జరిగింది. రోజూలాగే ఆ రోజు కూడా అడవిలోకి వెళ్లిన బాధితురాలిని ఆ ప్రాంతంలో పశువులు కాసే వ్యక్తి అటకాయించాడు. 

మాదక ద్రవ్యాలకు బానిసైన అతడు మరో ముగ్గురితో కలిసి gang rapeకి ఒడిగట్టినట్టు  భావిస్తున్నారు.  బాధితురాలి నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు  సోమవారం కేసు నమోదు చేశారు.  దళిత మహిళ molestationఘటనపై బిఎస్పి అధ్యక్షురాలు మాయావతి తీవ్రంగా స్పందించారు.  ఈ ఘటన సమాజానికి సిగ్గుచేటని,  నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.  నిందితుల్లో ఒకరిని అరెస్టు చేసిన పోలీసులు,  పరారీలో ఉన్న మిగిలిన వారికోసం ప్రత్యేక బృందాలతో  గాలిస్తున్నట్లు చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios