Dehradun: పురోలాలో ముస్లిం దుకాణంపై మూకదాడి జరిగిన తర్వాత ఈ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. పోలీసులు వచ్చేంతవరకు ఒక ముక ముస్లింల దుకాణాలపై దాడి చేశాయని రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఈ దాడుల వెనుక లవ్ జిహాద్ అంశం ఉందని సమాచారం.
Tension soar as mob attacks Muslim shop Uttarakhand: ఉత్తర కాశీలోని పురోలా పట్టణంలో ఓ ముస్లిం దుకాణదారుడిపై పలువురితో కూడిన గ్రూప్ దాడి చేసింది. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. లవ్ జిహాద్ అంశం నేపథ్యంలోనే ఈ దాడి జరిగిందని సమాచారం. ఉత్తరాఖండ్ లోని ఉత్తరకాశీ జిల్లా పురోలా పట్టణంలో ఒక వర్గానికి చెందిన గుంపు ఓ ముస్లిం దుకాణదారుడిపై దాడి చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని స్థానిక మీడియా పేర్కొంది. కాగా, ఈ గుంపు పలు నినాదాలు చేస్తూ తాళం వేసి ఉన్న ముస్లిం దుకాణదారుడి తలుపుపై కర్రలతో దాడి చేసిన వీడియో వైరల్ గా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వారిని చెదరగొట్టారు.
కాగా, మైనర్ హిందూ బాలికను ఇద్దరు వ్యక్తులు కిడ్నాప్ చేయడానికి చేసిన ప్రయత్నాన్ని స్థానికులు భగ్నం చేయడంతో మే 26 నుంచి పురోలా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. లవ్ జిహాద్ కుట్రను అమలు చేస్తున్నారని పలు హిందూ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ముస్లిం పురుషులు హిందూ మహిళలను ప్రలోభపెట్టి, వారిని ట్రాప్ చేసి మతమార్పిడి చేస్తున్నారనీ, లవ్ జిహాద్ కుట్ర దాడివుందని ఆరోపిస్తున్నారు. పోలీసులు మే 24న స్థానిక దుకాణదారుడు ఉబేద్ ఖాన్ (23), మోటార్ సైకిల్ మెకానిక్ జితేందర్ సైనీ (27)లను అరెస్టు చేశారు. అయితే ఈ నెల 15వ తేదీలోగా పట్టణాన్ని ఖాళీ చేయాలంటూ ముస్లిం వర్గానికి చెందిన దుకాణాల్లో బెదిరింపు పోస్టర్లు కనిపించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. హిందూ సమాజం నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తడంతో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి 'లవ్ జిహాద్' ఘటనలను అరికట్టడానికి జూన్ 9న సీనియర్ పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు.
బిపర్జోయ్ తుఫాను బీభత్సం.. గుజరాత్ లో లోతట్టు ప్రాంతాల ప్రజల తరలింపు
అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ లవ్ జిహాద్ కు వ్యతిరేకంగా బహిరంగంగా బయటకు వస్తున్న వారి సంఖ్య ఈ తరహా నేరాలపై పెరుగుతున్న అవగాహనకు అద్దం పడుతోందన్నారు. లవ్ జిహాద్ కేసుల్లో దోషుల పట్ల కఠినంగా వ్యవహరించాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. బయటి నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన వారి పూర్వాపరాలను ఎప్పటికప్పుడు వెరిఫికేషన్ డ్రైవ్ లు నిర్వహించాలని ఆదేశించారు. బార్కోట్, చిన్యాలీసౌర్, భట్వారీలలో కూడా నిరసనలు వెల్లువెత్తాయి. పలువురు ముస్లిం వ్యాపారులు భయంతో ఉత్తరకాశీ జిల్లాను విడిచి వెళ్లిపోయినట్లు సమాచారం.
లవ్ జిహాద్‌ను సహించేది లేదు.. కేసులు పెరుగుతుండటంపై ఉత్తరాఖండ్ సీఎం వార్నింగ్..
ఉత్తరకాశీలోని పురోలా ప్రాంతం నుంచి మొదలైన లవ్ జిహాద్ వివాదం ఇప్పుడు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు పాకుతోంది. ఇప్పుడు జిల్లాలోని గంగోత్రి పట్టణం వరకు వ్యాపించింది. రాష్ట్రవ్యాప్తంగా పెరుగుతున్న లవ్ జిహాద్ ఘటనలకు నిరసనగా శనివారం గంగోత్రిలో దుకాణాలు బంద్ చేశారు. నిరసనలో పాల్గొనే స్థానిక వ్యాపారులు చిన్న చిన్న చిన్న వ్యాపారాలలో నిమగ్నమై ఉన్న ధృవీకరించబడని బయటి వ్యక్తులు రావడంపై ఆందోళన వ్యక్తం చేశారు. గంగోత్రిలో శాంతి భద్రతలు దెబ్బతింటున్నాయని ఆరోపించారు. ఇది చార్ ధామ్ తీర్థయాత్ర నగరాలలో ఒకటి. దీనిపై తక్షణమే అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
