తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతి గల అసలు కారణాలను అపోలో హాస్పిటల్ డాక్టర్ వివరించారు. మొదడుకి రక్తం సరఫరా జరగకపోవడం వల్లనే ఆమె చనిపోయారని అపోలో హాస్పిటల్ లో పనిచేసే ప్రముఖ గుండె సంబంధిత నిపుణులు  డాక్టర్ సుందర్ వివరించారు.

2016 వ సంవత్సరం డిసెంబర్ 5వ తేదీన జయలలిత చనిపోయిన సంగతి తెలిసిందే. కాగా.. ఆ మృతిపై పలువురు పలు అనుమానాలు వ్యక్తం చేశారు. దీంతో..దీనిపై కోర్టులో విచారణ జరుగుతోంది.

ఈ నేపథ్యంలో తాజాగా జయలలితకు వైద్యం అందించిన వారిలో ఒకరైన డాక్టర్ సుందర్.. ఆమె మరణానికి గల కారణాలను వివరించారు.  జయలలితకి మొదట హార్ట్ ఎటాక్ రావడంతో ఆస్పత్రిలో చేరినట్లు చెప్పారు. వెంటనే ఆమెకు ఎక్ట్రాకార్పొరియల్ మెంబ్రేన్ ఆక్సిజనేషన్(ఈసీఎంవో) ఏర్పాటు చేశామని చెప్పారు. ఆ తర్వాత ఆమె మొదడుకి రక్తం సరఫరా అవ్వడం ఆగిపోయిందని తెలిపారు. ఈ కారణంగానే జయలలిత మృతి చెందినట్లు తెలిపారు. 

దాదాపు 75రోజుల పాటు అపోలో ఆస్పత్రిలో  చికిత్స పొందిన జయలలిత డిసెంబర్ 5వ తేదీన చనిపోగా.. 6వ తేదీన బయట ప్రజలకు తెలియజేశారని చెప్పారు.