ఆటోను ఢీ కొట్టిన లారీ.. తొమ్మిది మంది మృతి, నలుగురి పరిస్థితి విషమం...
బీహార్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటోలో వెడుతున్న క్యాటరింగ్ సిబ్బంది మృత్యువాత పడ్డారు. వీరిలో మరికొంతమంది పరిస్థితి విషమంగా ఉంది.
బీహార్ : బుధవారం తెల్లవారుజామున బీహార్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 9మంది మృతిచెందగా మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. బుధవారం తెల్లవారుజామున ఓ ఆటోరిక్షాను లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.బీహార్ లోని రామ్ గౌడ్ చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లఖిసరాయ్ దగ్గరున్న ఝూల్నా గ్రామ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం గురించిన వివరాలను తెలుపుతూ.. బుధవారం తెల్లవారుజామున ప్రయాణికుల తో వెళుతున్న ఆటోరిక్షాను ను ఓ లారీ రాంగ్ సైడ్ లో దూసుకు వచ్చి ఢీకొట్టింది. దీంతో ఎనిమిది మంది అక్కడికక్కడే మృతి చెందారు. ఐదుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందగానే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 1056 పోస్టులకు యూపీఎస్ సీ నోటిఫికేషన్ విడుదల, పూర్తి వివరాలివే...
ఆ తర్వాత చికిత్స పొందుతున్న టెంపో డ్రైవర్ మృతి చెందడంతో.. చనిపోయిన వారి సంఖ్య 9కి చేరుకుంది. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేస్తున్నారు. ఘటన తర్వాత లారీ డ్రైవర్ సంఘటన స్థలం నుంచి పారిపోయాడు. దీంతో అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రమాదంలో బాధితులంతా టెంపోలోని వారే… వారందరూ సికంద్రాలో క్యాటరింగ్ పని ముగించుకుని ఇంటికి వెళ్లడానికి లఖిసరాయ్ రైల్వే స్టేషన్ కు వెళుతున్నారు.
ఎన్హెచ్ థర్టీ మీద వేగంగా వచ్చిన లారీ టెంపోను ఢీ కొట్టింది. దీంతో ప్రమాదం జరిగింది. మృతుల బంధువులు వచ్చిన తర్వాత మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించనున్నారు.