Asianet News TeluguAsianet News Telugu

Republic Day: గణతంత్ర రిపవేడుకల్లో యూపీ నుంచి బాలరాముడి శకటం

గణతంత్ర వేడుకల్లో కర్తవ్యపథ్‌లో పరేడ్ జరిగింది.ఇందులో యూపీ నుంచి వచ్చిన శకటం అందరి దృష్టిని ఆకర్షించింది. బాలరాముడితో ఉన్న ఆ శకటానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతున్నది.
 

lord ram lalla tableau in republic day 2024 parade at karthavya path kms
Author
First Published Jan 26, 2024, 12:41 PM IST | Last Updated Jan 26, 2024, 12:48 PM IST

Lord Ram: రాజధాని ఢిల్లీలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ జెండా ఎగరేశారు. ఈ సారి గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మ్యాక్రన్ విచ్చేశాడు. గణతంత్ర దినోత్సవాల్లో భాగంగా కర్తవ్యపథ్‌లో పరేడ్‌లో శకటాల ప్రదర్శన జరిగింది. పలు రాష్ట్రాల నుంచి శకటాలు పరేడ్ చేశాయి. ఇందులో భాగంగా ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన శకటం అందరినీ ఆకర్షించింది. ఈ శకటం బాలరాముడిని ప్రదర్శించింది.

యూపీ నుంచి గణతంత్ర పరేడ్‌లో భాగంగా వచ్చిన శకటం బాలరాముడిని ప్రదర్శించింది. ధనస్సు, విల్లుతో బాలరాముడు శకటంపై నిలబడిన రూపంలో బొమ్మను రూపొందించారు. వెనుకాల ఇద్దరు సాధువులు కలశాలతో నిలబడినట్టుగా చిత్రించారు. బాలరాముడి శకటానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఈ శకటం అయోధ్య నగరానికి చారిత్రకంగా, ఆధ్యాత్మికంగా గల ప్రాశస్త్యాన్ని వెల్లడిస్తుందని అధికార వర్గాలు తెలిపాయి. వికసిత్ భారత్, సమృద్ధ్ విరాసత్ అనే అంశాలను ఈ శకటం ప్రదర్శిస్తుందని పేర్కొన్నాయి.

శకటం వెనుకాల ట్రైలర్‌లో ఉత్తరప్రదేశ్ అభివృద్ధి పనులను ప్రదర్శించారు. రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్‌ను కూడా ఈ శకటం ప్రదర్శించింది. ఈ ఆర్ఆర్‌టీఎస్‌‌లో ఒక సెక్షన్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గతేడాది అక్టోబర్‌లో ప్రారంభించారు. అలాగే, ఈ శకటంపై ఏర్పాటు చేసిన ఎల్‌ఈడీ స్క్రీన్ పై శరవేగంగా జరిగిన ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద అంతర్జాతీయ విమానాశ్రయాన్ని(జెవార్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు) చిత్రించింది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios