హనుమంతుడు ఒక ఆదివాసి.. కాంగ్రెస్ ఎమ్మెల్యే వ్యాఖ్య, దేవుడికిది అవమానమంటూ బీజేపీ నేత ఫైర్

రాముడు లంకకు చేరుకోవడానికి అడవిలోని గిరిజనులు సహాయపడ్డారని, వారిని వానరులు అన్నారని, నిజానికి వారు ఆదివాసీలు అని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉమాంగ్ సింఘార్ అన్నారు. హనుమంతుడు కూడా ఆదివాసేనని, తామంత హనుమంతుడి వారసులమేనని వివరించారు.
 

lord hanuman is an adivasi, we descended from him says congress mla umang singhar, bjp fires kms

Lord Hanuman: మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉమాంగ్ సింఘార్ శనివారం బిర్సా ముండా 123వ శతజయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఆ వేడుకకు హాజరైన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. హనుమంతుడు ఒక ఆదివాసీనే అని అన్నారు. రామాయణంలో వానరం అని చిత్రించిన వారు నిజానికి గిరిజనులే అని వివరించారు. ఈ వ్యాఖ్యలను బీజేపీ నేత హితేశ్ బాజ్‌పాయ్ తీవ్రంగా ఖండించారు. ఇలా వ్యాఖ్యానించి దేవుడిని అవమానించారని పేర్కొన్నారు.

ఆదివాసీల మనోస్థైర్యాన్ని పెంచేలా, ప్రధాన స్రవంతిలో కలవడానికి, న్యూనతా భావాలను వదిలిపెట్టడానికి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉమాంగ్ సింఘార్ వారి గొప్పతనాన్ని విడమర్చి చెప్పే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ.. అడవిలో నివసించిన ఆదివాసీలే శ్రీరాముడు లంకకు చేరుకోవడానికి సహాయపడ్డారని వివరించారు. కొందరు వారిని వానర సేన అని అన్నారు. ఇవన్నీ కేవలం కథలు మాత్రమే అని పేర్కొంటూ.. హనుమంతుడు కూడా ఒక ఆదివాసీనే అని అన్నారు. మనమంతా ఆయన వారసులమే అని చెప్పారు. కాబట్టి, ఆదివాసీలు గర్వంగా మెదలాలని వివరించారు.

Also Read: దోచుకెళ్లిన ఆయుధాలు ఈ బాక్సులో వేయండి.. మణిపూర్ బీజేపీ ఎమ్మెల్యే ఇంటి ఎదుట ఏర్పాటు

బీజేపీ స్టేట్ పార్టీ స్పోక్స్‌పర్సన్ హితేశ్ బాజ్‌పాయ్ ఈ వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు. హనుమాన్‌ను వారు దేవుడిగా పరిగణించరని ఆరోపించారు. హిందువులు హనుమంతుడిని దేవుడిగా భావించి పూజించాలని వారు కోరుకోరు అంటూ కాంగ్రెస్ నేతపై వ్యాఖ్యలు చేశారు. హనుమాన్ అంటే కాంగ్రెస్ ఆలోచన ఇదేనా? అని ప్రశ్నించారు. మత మార్పిళ్లకు పాల్పడే క్యాథలిక్ పాస్టర్లు మాట్లాడే భాషనే ఇప్పుడు కాంగ్రెస్ మాట్లాడుతున్నదని ఫైర్ అయ్యారు. ఈ వ్యాఖ్యలపై మాజీ క్యాబినెట్ మినిస్టర్ ఉమాంగ్ సింఘార్ స్పందించారు.

‘నువ్వు దీన్ని హనుమంతుడికి అవమానంగా భావిస్తావా? ఆదివాసీలు హనుమంతుడి వారసులంటే నీకు అవమానంగా అనిపించిందా? హనుమంతుడు మా గిరిజన సమూహానికి చెందినవారని చెప్పాను. ఇలా చెప్పిన నా ప్రసంగాన్ని చిచోరా స్టేట్‌మెంట్ అంటావా? ’ అంటూ సింఘార్ తిరిగి ఫైర్ అయ్యారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios