న్యూఢిల్లీ: దేశంలో  అత్యధిక కాలం పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన రికార్డు పవన్ చామ్లింగ్ పేరిట ఉంది. 24  ఏళ్ల 165 రోజుల పాటు పవన్ చామ్లింగ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన రికార్డు ఆయనపై ఉంది. 

సుధీర్ఘకాలం ఈ రికార్డు కమ్యూనిష్టు ధిగ్గజం బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి జ్యోతిబసు పేరున ఉంది. చివరి టర్మ్‌లో జ్యోతిబసు పూర్తి కాలం సీఎంగా కొనసాగితే ఆయన రికార్డును చెరిపివేయడానికి సమయం పట్టే అవకాశం ఉండేదనే రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.బెంగాల్ సీఎంగా జ్యోతిబసు 23 ఏళ్ల, 137 రోజుల పాటు ఆయన సీఎంగా పనిచేశారు. పార్టీ ఆదేశాల మేరకు జ్యోతిబసు సీఎం  పదవిని బుద్ధదేబ్ భట్టాచార్యకు అప్పగించారు. 

Also read:న్యూఢిల్లీ అసెంబ్లీ ఫలితాలు 2020: ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తగ్గట్టుగానే ఆప్ దూకుడు

6 నవంబర్ 2000 నుండి 13 మే 2011 వరకు సీఎంగా ఆయన కొనసాగారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో సీపీఎం నేతృత్వంలో ఏర్పాటైన  లెఫ్ట్‌ఫ్రంట్ ప్రభుత్వానికి జ్యోతిబసు సీఎంగా పనిచేశారు.

1977 జూన్ 21వ తేదీ నుండి 2000 అక్టోబర్ 26వ తేదీ వరకు బెంగాల్ కు సీఎంగా జ్యోతిబసు కొనసాగారు.  ఆ తర్వాత బుద్దదేవ్ భట్టాచార్యా సీఎంగా కొనసాగారు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడే సమయంలో  జ్యోతి బసును ప్రధానమంత్రి పదవిని చేపట్టాలని యునైటెడ్ ఫ్రంట్ లోని పార్టీలు కోరాయి. 

అయితే  పార్టీకి పూర్తిస్తాయి ఎంపీలు లేనందున  ప్రధాని పదవిని తీసుకోవద్దని సీపీఎం తేల్చి చెప్పింది.  పార్టీ పొలిట్ బ్యూరో, కేంద్ర కమిటీ ఈ విషయాన్ని తేల్చి చెప్పింది. దీంతో జ్యోతిబసు ప్రధాని పదవిని తిరస్కరించారు. 

ఆ తర్వాత ప్రధాని పదవిని సీపీఎం వదులుకోవడం చారిత్రక తప్పిదం అంటూ జ్యోతి బసు చేసిన వ్యాఖ్యలు పార్టీలో తీవ్ర దుమారాన్ని రేపాయి. ప్రధాని పదవిని తీసుకోంటే పార్టీ పరిస్థితి మరింత మెరుగ్గా ఉండేదని భావించేవారు కూడ  పార్టీలో లేకపోలేదు. 2010 జనవరి 17వ తేదీన జ్యోతిబసు మృతి చెందారు. బెంగాల్ రాష్ట్రంలో వరుసగా సీపీఎం నేతృత్వంలోని లెఫ్ట్‌ఫ్రంట్  విజయం సాధించింది.

ఇక త్రిపుర రాష్ట్రానికి వరుసగా  నాలుగు దఫాలు మాణిక్ సర్కార్ ముఖ్యమంత్రిగా కొనసాగారు. 1998 నుండి 2018 వరకు మాణిక్ సర్కార్ త్రిపుర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2018 ఎన్నికల్లో త్రిపురలో సీపీఎం ఓటమి పాలైంది. నాలుగు దఫాలు సీఎంగా పనిచేసిన మాణిక్ సర్కార్ అత్యంత నిరాడంబరంగా జీవితాన్ని గడుపుతారు. మాణిక్ సర్కార్ సీఎంగా ఉన్న కాలంలో అత్యంత నిరుపేద సీఎంగా రికార్డు సృష్టించారు.

ఇక ఒడిశా రాష్ట్రంలో నవీన్ పట్నాయక్ వరుసగా సీఎంగా బాధ్యతలు చేపట్టారు. వరుసగా నవీన్ పట్నాయక్ ఐదో దఫా సీఎంగా కొనసాగుతున్నారు.  2000 మార్చి 5వ తేదీన నవీన్ పట్నాయక్  తొలిసారిగా సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. 

మధ్యప్రదేశ్ రాష్ట్రానికి  శివరాజ్ సింగ్ చౌహాన్ కూడ వరుసగా మూడు పర్యాయాలు సీఎంగా పనిచేశారు. 2005 నుండి 20018 వరకు శివరాజ్ సింగ్ చౌహాన్ మధ్యప్రదేశ్ సీఎంగా పనిచేశారు. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ ఓటమి పాలైంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 

మావోయిస్టులకు అత్యంత పట్టున్న రాష్ట్రంగా ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రం పేరొందింది. ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలో మూడు పర్యాయాలు బీజేపీని అధికారంలోకి తెచ్చిన ఘనత రమణసింగ్‌కు దక్కుతోంది, చామల్ బాబాగా ఆయనను ప్రజలు ముద్దుగా పిలుచుకొనేవారు. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలో బీజేపీ ఓటమి పాలైంది. 

గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ  వరుసగా మూడు దఫాలు విజయం సాధించారు. 2001 అక్టోబర్ 7వ తేదీన ఆయన సీఎంగా కేశుభాయ్ పటేల్ నుండి బాధ్యతలను స్వీకరించారు. 

2002లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించారు. 2002 డిసెంబర్ 22 నుండి 2007 డిసెంబర్ 22వరకు, 2007 డిసెంబర్ 23 నుండి 2012 డిసెంబర్ 20వరకు, 2012 డిసెంబర్ 20 నుండి 2014 మే 22 వ తేదీ వరకు ఆయన సీఎంగా కొనసాగారు. 

గుజరాత్ సీఎంగా ఉంటూనే పార్లమెంట్ ఎన్నికల్లో  ఎన్డీఏ పక్షాలు భారీ విజయం సాధించడంతో ఆయన ప్రధాని పదవిని అధిష్టించారు. 2019 ఎన్నికల్లో  రెండోసారి ఆయన ప్రధానిగా బాధ్యతలను చేపట్టారు.


ఢిల్లీ సీఎంగా షీలా దీక్షిత్ వరుసగా మూడు దఫాలు పనిచేశారు.1998 డిసెంబర్ 3వ తేదీ నుండి 2003 డిసెంబర్ 1వ తేదీ వరకు కాంగ్రెస్ పార్టీ తరపున షీలా దీక్షిత్ సీఎంగా పనిచేశారు. వరుసగా మూడు దఫాలు షీలా దీక్షిత్ ఢిల్లీ సీఎంగా పనిచేశారు. హ్యాట్రిక్ సీఎంగా పనిచేసిన రికార్డు ఆమెకు ఉంది. 

ఆ తర్వాత  2003 డిసెంబర్ 1వ తేదీ నుండి 2008 నవంబర్29వ తేదీ వరకు కాంగ్రెస్ పార్టీకి చెందిన షీలా దీక్షిత్ రెండో సారి సీఎంగా బాధ్యతల్లో ఉన్నారు. ఇక మూడో టర్మ్‌లో 2008 నవంబర్ 29వ తేదీ నుండి 2013 డిసెంబర్ 28వ తేదీ వరకు ఢిల్లీ సీఎంగా షీలా దీక్షిత్ మూడో దఫా సీఎంగా పనిచేశారు.

ఇక  ఢిల్లీకి వరుసగా కేజ్రీవాల్ బాధ్యతలను స్వీకరించనున్నారు. 2013 డిసెంబర్ 28వ తేదీ నుండి 2014 ఫిబ్రవరి 14వ తేదీన తొలిసారిగా ఆప్ తరపున  అరవింద్ కేజ్రీవాల్ తొలిసారిగా సీఎంగా బాధ్యతలను చేపట్టారు.2014 ఫిబ్రవరి 14వ తేదీ నుండి 2015 ఫిబ్రవరి 15వ తేదీ వరకు ఢిల్లీలో రాష్ట్రపతి పాలన ఉంది. 

ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఢిల్లీలో మరోసారి ఆప్  అధికారాన్ని దక్కించుకొంది. 2015 ఫిబ్రవరి 14వ తేదీన  రెండోసారి ఆప్ అధికారాన్ని సాధించింది. రెండోసారి అరవింద్ కేజ్రీవాల్ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు.  

ప్రస్తుతం రెండోసారి ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉంటూనే అరవింద్ కేజ్రీవాల్  ఎన్నికలను ఎదుర్కొన్నారు. ఈ ఎన్నికల్లో కేజ్రీవాల్ పార్టీ ఆప్ 63 స్థానాలను దక్కించుకొంది. బీజేపీ 7 స్థానాలకే పరిమితమైంది.అసోం సీఎంగా తరుణ్ గొగొయ్ 2001 నుండి 2016 వరకు సీఎంగా కొనసాగారు.