న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో  ఆప్  మరోసారి విజయం సాధిస్తోందని ఎగ్జిట్ పోల్స్ తేల్చి చెప్పాయి.  గతంలో ఎగ్జిట్ పోల్స్ కు  విరుద్దంగా ఎన్నికల ఫలితాలు వచ్చిన సందర్భాలు కూడ ఉన్నాయి. 

ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను బీజేపీ ఏకీభవించలేదు. కానీ ప్రస్తుతం ఫలితాలు మాత్రం  ఆప్‌కు అనుకూలంగా ఉన్నాయి. దాదాపుగా అన్ని మీడియా సంస్థలు కూడ ఆప్‌కు అనుకూలంగానే ఫలితాలు ఉండే అవకాశం ఉందని ప్రకటించాయి.

Also read:న్యూఢిల్లీ అసెంబ్లీ ఫలితాలు 2020: గతం కంటే మెరుగైన బీజేపీ

ఢిల్లీ అసెంబ్లీకి ఈ నెల 8వ తేదీన ఎన్నికలు జరిగాయి. పోలింగ్ పూర్తైన రోజు సాయంత్రమే పలు మీడియా సంస్థలు  ఎగ్జిట్ పోల్స్ ను విడుదల చేశాయి. అన్నింటిలో కూడ  ఆప్ దే అధికారమని  తేల్చి చెప్పారు.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో  70 స్థానాల్లో 58 స్థానాల్లో ఆప్ ముందంజలో ఉంది. బీజేపీ 18 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ  ఒక్క స్థానంలో కూడ సత్తా చాటలేకపోయింది. తొలి దశలో ఒక్క స్థానంలో కాంగ్రెస్ కొంతసేపు ఆధిక్యంలో కన్పించింది. కానీ, ఆ తర్వాత  కాంగ్రెస్ ఏ ఒక్క స్థానంలో కూడ ఆధిక్యంలో నిలవలేదు.

 
ఎగ్జిట్ పోల్స్   ఫలితాలు 


సుదర్శన్ న్యూస్‌ 

ఆప్‌: 40 - 45

బీజేపీ: 24 - 28

కాంగ్రెస్ :2 - 3

ఇండియా టీవీ

ఆప్:44

బీజేపీ :26

కాంగ్రెస్: 0


రిపబ్లిక్ టీవీ

ఆప్:48 - 61

బీజేపీ: 9 - 12

కాంగ్రెస్: 0 - 1


టైమ్స్ నౌ

ఆప్‌: 44

బీజేపీ: 26

కాంగ్రెస్: 0


న్యూస్ ఎక్స్

ఆప్: 53 - 57

బీజేపీ: 11 - 17

కాంగ్రెస్: 0 - 2

న్యూస్ 18

ఆప్: 44

బీజేపీ:26