లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా తండ్రి కృషన్ బిర్లా మంగళవారం నాడు మరణించారు. మంగళవారం సాయంత్రం సమయంలో అనారోగ్యంతో మరణించారు. వార్ధక్యం కారణంగా ఆయన చాలాకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. 

ఓం బిర్లా తండ్రిగారైన శ్రీ క్రిషన్ బిర్లా ప్రభుత్వోద్యోగిగా పనిచేసి రిటైర్ అయ్యారు. ఓంబిర్లా ప్రస్తుతం రాజస్థాన్ లోని కోట పార్లమెంటరీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2014, 2019లో వరుసగా రెండు పర్యాయాలు ఆయన అక్కడినుండి గెలుపొందారు.