పార్లమెంట్ సభ్యులు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ మంత్రులపై వచ్చే అవినీతి ఆరోపణలను దర్యాప్తు చేసేందుకు ఏర్పాటైన లోక్‌పాల్‌కు కేంద్రప్రభుత్వం లోగో, నినాదాన్ని ఎంపిక చేసింది.

ఇందుకోసం కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ ఇటీవల ఓ పోటీ నిర్వహించింది. ఇందులో సుమారు 6 వేల మందికి పైగా పాల్గొని లోగో డిజైన్లు, నినాదాలు పంపారు. వీటిలో ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు చెందిన ప్రశాంత్ మిశ్రా రూపొందించిన డిజైన్, నినాదాన్ని అధికారులు ఎంపిక చేశారు.

Also read:సీఎం పదవికి రాజీనామా చేస్తున్నా: ఫడ్నవీస్

‘‘లోక్‌పాల్ ప్రజలకు ఎలా రక్షణ కల్పిస్తుంది... ఎలా న్యాయం చేస్తుంది‘‘ అనేది ప్రతిబింబించేలా ఈ లోగోను అతను రూపొందించాడు. పౌర జనాన్ని సూచించేలా ముగ్గురు వ్యక్తులు, త్రివర్ణ పతాకంలోని అశోక చక్రం, భారత న్యాయ వ్యవస్థను ప్రతిబింబించేలా కాషాయ రంగులో పుస్తకం, ఆ పుస్తకాన్ని రెండు చేతుల్లో పట్టుకున్నట్లుగా లోగోను తయారు చేశారు.

మొత్తం 2,236 మంది లోగో డిజైన్లు పంపగా... ప్రశాంత్‌ను విజేతగా ప్రకటించారు. అలాగే 4,705 మంది నినాదాలు పంపగా.. వీటిలో ఏ ఒక్కటి సంతృప్తికరంగా లేకపోవడంతో ఎవరిని ఎంపిక చేయలేదని సిబ్బంది వ్యవహారాల శాఖ వెల్లడించింది.

Also Read:Maharashtra update:అజిత్ పవార్ రాజీనామా: చక్రం తిప్పిన శరద్ పవార్ భార్య

దీంతో ‘‘ ఇతరుల సంపద పట్ల ఆశపడొద్దు’’ అంటూ ఈశోపనిషత్‌లో ఉన్న వ్యాఖ్యలను లోక్‌పాల్ కమిటీతో చర్చించి నినాదంగా తీసుకున్నారు. కాగా... లోగో విజేతకు రూ.25 వేల నగదు బహుమతిని ప్రకటించారు.