న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు  ఈ నెల 31వ తేదీ నుండి  ఫిబ్రవరి 13వ తేదీ వరకు జరగనున్నాయి. ఫిబ్రవరి 1వ, తేదీన కేంద్ర ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది.

పార్లమెంట్ సమావేశాలను పురస్కరించుకొని ఈ నెల 30వ తేదీన అఖిలపక్ష సమావేశాన్ని లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటించారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ అనారోగ్యం కారణంగా శస్త్రచికిత్స జరిగింది.

దీంతో పీయూష్ గోయల్ ఫిబ్రవరి 1వ తేదీన  ఓటాన్ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వానికి ఇదే చివరి బడ్జెట్.  అయితే కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక  పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఫిబ్రవరి 1వ తేదీన  రాష్ట్రపతి రామ్‌నాద్ కోవింద్ ప్రసంగంతో  బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.