Asianet News TeluguAsianet News Telugu

స్పీకర్ నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం: టిఆర్ఎస్ నుంచి నామా, వైసిపి నుంచి మిథున్ రెడ్డి

లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా నేతృత్వంలో ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. త్వరలో జరగబోతున్న పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో స్పీకర్ ఈ సమావేశాన్ని నిర్వహించారు.

lok sabha speaker conducts all party meeting in delhi
Author
Delhi, First Published Nov 16, 2019, 6:30 PM IST

లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా నేతృత్వంలో ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. త్వరలో జరగబోతున్న పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో స్పీకర్ ఈ సమావేశాన్ని నిర్వహించారు. అన్ని పార్టీల ప్లోర్ లీడర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు. టిఆర్ఎస్ పార్టీ నుంచి నామా నాగేశ్వర రావు, వైసిపి నుంచి మిథున్ రెడ్డి ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో ప్రధాని మోడీ కూడా పాల్గొంటున్నారు. త్వరలో జరగబోయే పార్లమెంట్ సమావేశాలు సజావుగా జరిగేలా అన్ని పార్టీలు సహకరించాలని స్పీకర్ ఓం బిర్లా కోరనున్నారు. 

పార్లమెంటు శీతాకాల సమావేశాలు రేపటి నుండి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.  గత సమావేశాల్లో పార్లమెంటులో ఆర్టికల్ 370 రద్దు తో తీవ్ర దుమారం రెజినా విషయం తెలిసిందే. ఈ సారి శీతాకాల సమావేశాల్లో కూడా ఏదైనా ఒక వివాదాస్పద బిల్లును ప్రవేశపెట్టె ఆస్కారం ఉంది. 

ఉమ్మడి పౌర స్మృతిని కేంద్ర సర్కార్ ఈ సమావేశాల్లో ప్రవేశ పెట్టే ఆస్కారముందని తెలుస్తుంది. ఏదేమైనా, దేశ పాలనను చేపట్టిన తరువాత, ప్రధానమంత్రి ఎప్పుడూ  వన్ ఇండియా అనే మాట్లాడుతూ ఉంటారు.  నిత్యం  సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అనే మంత్రాన్ని జపిస్తూ ఉన్నారు. 

మొన్నటి అయోధ్య తీర్పు కూడా మోడీ అనుకూల పవనాలు దేశమంతటా బలంగా వీచేలా చేసింది. తీర్పు వెలువడిన కొన్ని గంటల తరువాత దేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ,  "నవంబర్ 9, నేటితో కక్ష, ఈర్షా ద్వేషాలకు చరమగీతం పాడుదాం" అని అన్నారు. ప్రస్తుత భారతదేశంలో భయానికి, కోపతాపాలకు,నెగటివిటీకి చోటులేదన్నారు.   

ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుతో, బిజెపి ప్రభుత్వం తన అజెండాలోని అన్ని హిందుత్వ వాగ్ధానాలను దాదాపుగా పూర్తి చేసింది - ఆర్టికల్ 370, ఎన్‌ఆర్‌సిని రద్దు చేయడం. 

"యూనిఫాం సివిల్ కోడ్ (ఉమ్మడి పౌర స్మృతి)" మాత్రమే మిగిలి ఉన్న ప్రధాన సమస్య. రానున్న బడ్జెట్ సమావేశాల్లో బీజేపీ ఈ ఉమ్మడి పౌరస్మృతికి సంబంధించిన  బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టే ఆస్కారమే లేకపోలేదు. లోక్ సభలో బ్రహ్మాండమైన మెజారిటీ వారి సొంతం. రాజ్యసభలో కూడా పావులు కదపడం ద్వారా వారికి కావలిసిన చట్టాలను సునాయాసంగా పాస్ చేయించుకుంటున్నారు. 

ఉమ్మడి పౌర స్మృతి విషయంలో బీజేపీ ఎప్పటినుంచో తన వైఖరిని బహిరంగంగానే ప్రకటించింది. ఎన్నికల మానిఫెస్టోలో కూడా దీన్ని పొందుపరిచారు. అన్నిటికంటే ముఖ్యంగా భారత రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల్లో ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేయాలనీ పేర్కొన్నారు. కాబట్టి ఇదేదో హిందుత్వ వాదం కోసం బీజేపీ తీసుకుంటున్న చర్య అనే కన్నా రాజ్యాంగంలో ఉన్న ఒక ఆదేశిక సూత్రానికి చట్టబద్ధత కల్పించే ప్రయత్నంగా చూడాల్సి ఉంటుంది. 

Also read: ayodhya verdict: అయోధ్య సమస్యకు సామరస్య పరిష్కారం.. వారికి కోర్టు ప్రశంసలు

ఇప్పటికే ట్రిపుల్ తలాక్ అంశంలో అది చెల్లుబాటు కాకుండా చట్టం తీసుకువచ్చింది. తద్వారా సివిల్ చట్టంలో ఒక ముఖ్య అంశమైన పెళ్లిని మామూలు చట్ట పరిధి కిందికి తీసుకొని వచ్చారు. ఈ చట్టం లోని లోటుపాట్లను పక్కన పెడితే ఈ చట్టాన్ని ముస్లిం మహిళలు కూడా ఆహ్వానించారు. కారణం- ఈ డిమాండ్ ముస్లిం మహిళాల్లోంచి బయటికి వచ్చింది. 

Follow Us:
Download App:
  • android
  • ios