న్యూఢిల్లీ: ఆర్థిక బిల్లు -2020కు పార్లమెంట్ సోమవారం నాడు ఆమోదం తెలిపింది. ఎలాంటి చర్చ లేకుండానే ఫైనాన్స్ బిల్లును పార్లమెంట్ ఆమోదించింది.మూజువాణి ఓటు ద్వారా ఈ బిల్లుకు పార్లమెంట్ ఆమోదించింది.

కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న తరుణంలో దేశంలోని పేదలకు ఆర్ధిక ప్యాకేజీని ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ నేత అధిర్ రంజన్ చౌదరి పార్లమెంట్ లో డిమాండ్ చేశారు. ఆర్ధిక బిల్లుపై వాయిస్ ఓటు జరుగుతున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ నేత ఈ డిమాండ్ చేశారు.

ఇతర విపక్షాలు కూడ కాంగ్రెస్ పార్టీ నేత అధిర్ రంజన్ చౌదరి చేసిన డిమాండ్ కు మద్దతు పలికాయి. ఫైనాన్స్ బిల్లుకు ఆమోదం తెలిపిన తర్వాత లోక్ సభ నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టుగా స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు.

Also read:కరోనా ఎఫెక్ట్: తెలంగాణ సరిహద్దుల మూసివేత, నిలిచిపోయిన వాహనాలు

కరోనా కారణంగా దేశంలోని పలు రాష్ట్రాలు లాక్ డౌన్ ను ప్రకటించాయి. దేశ వ్యాప్తంగా 75 జిల్లాల్లో లాక్ డౌన్ ప్రకటించాయి. దీంతో పార్లమెంట్ సమావేశాలను కూడ  వాయిదా వేయాలని కేంద్రం భావించింది. దీంతో సోమవారం నాడు ఫైనాన్స్ బిల్లు ఆమోదించిన వెంటనే పార్లమెంట్ ను నిరవధికంగా వాయిదా వేశారు