లోక్ సభ ఎన్నికలు.. రాజ్ నాథ్ సింగ్ నేతృత్వంలో బీజేపీ మేనిఫెస్టో కమిటీ ఏర్పాటు..

లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ మేనిఫెస్టో కమిటీ ఏర్పాటు అయ్యింది. దీనికి కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు రాజ్ నాథ్ సింగ్ నేతృత్వం వహించనున్నారు. త్వరలోనే ఈ కమిటీ పూర్తి స్థాయి మేనిఫెస్టో ను తయారు చేయనుంది.

Lok Sabha elections. Bjp's manifesto committee to be formed under the chairmanship of Rajnath Singh..ISR

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని ప్రధాన పార్టీలు మేనిఫెస్టోపై కసరత్తు ప్రారంభించేందుకు సమాయత్తమవుతున్నాయి. అందులో భాగంగానే కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నేతృత్వంలో బీజేపీ మేనిఫెస్టో కమిటీ ఏర్పాటు అయ్యింది. ఈ కమిటీకి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కన్వీనర్ గా, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కో కన్వీనర్ గా వ్యవహరించనున్నారు. వీరితో పాటు 24 మందిని ఈ కమిటీలో సభ్యులుగా చేర్చారు. 

అర్జున్ ముండా, భూపేంద్ర యాదవ్, అర్జున్రామ్ మేఘ్వాల్, కిరణ్ రిజిజు, అశ్విని వైష్ణవ్, ధర్మేంద్ర ప్రధాన్, భూపేంద్ర పటేల్, హిమంత బాశ్వశర్మ, విష్ణుదేవ్ సాయి, మోహన్ యాదవ్, శివరాజ్ సింగ్ చౌహాన్, వసుంధర రాజే, స్మృతి ఇరానీ, జువాల్ ఓరమ్, రవిశంకర్ ప్రసాద్, సుశీల్ మోదీ, కేశవ్ ప్రసాద్ మౌర్య, రాజీవ్ చంద్రశేఖర్, వినోద్ తావ్డే, రాధామోహన్ దాస్ అగర్వాల్, మంజీందర్ సింగ్ సిర్సా, ఓపీ ధన్కర్, అనిల్ ఆంటోని సభ్యులుగా ఉన్నారు. 

మార్చి 28న బీజేపీ పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఎన్నికల ఇంచార్జీ, కో-ఇన్చార్జిలను నియమించింది. అసోంకు కెప్టెన్ అభిమన్యు, ఛత్తీస్ గఢ్ కు నితిన్ నబిన్, ఢిల్లీకి ఓపీ ధన్ ఖడ్, మహారాష్ట్రకు దినేశ్ శర్మ, మేఘాలయకు ఎం చుబా ఆవో, మణిపూర్ కు అజిత్ ఘోప్చడే, మిజోరాంకు దేవేశ్ కుమార్, నాగాలాండ్ కు నళిన్ కోహ్లీ, తెలంగాణకు అభయ్ పాటిల్, త్రిపురకు అవినాష్ రాయ్ ఖన్నాలను ఇన్ చార్జిలుగా నియమించారు.

రాజ్యసభ ఎంపీ, ఉత్తరప్రదేశ్ మాజీ ఉపముఖ్యమంత్రి దినేశ్ శర్మను మహారాష్ట్రకు ఎన్నికల ఇంచార్జీగా, హర్యానా బీజేపీ మాజీ చీఫ్ ఓపీ ధన్కర్ ను ఢిల్లీకి ఇంచార్జీగా నియమించింది. 

ఇదిలా ఉండగా.. ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికల ప్రక్రియ అయిన ఏడు దశల లోక్ సభ ఎన్నికల ప్రక్రియ ఏప్రిల్ 19 న ప్రారంభం కానుంది. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది. మొత్తం 10.5 లక్షల పోలింగ్ కేంద్రాల్లో 44 రోజుల పాటు జరిగిన పోలింగ్ ప్రక్రియలో 49.7 కోట్ల మంది పురుషులు, 47.1 కోట్ల మంది మహిళలు మొత్తం 97 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios