Asianet News TeluguAsianet News Telugu

Exit Polls 2024 : 2014, 19 ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పాయి... ఏం జరిగింది? 

భోజనం చేసేముందు వంటకాల రుచులు తెలుసుకోవడం భారతీయుల అలవాటు. ఇదే ఎన్నికల్లోనూ కొనసాగుతోంది... పలితాల వెల్లడికి ముందు ఎగ్జిట్ పోల్స్ పై ప్రజలు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. జూన్ 1న అంటే ఇవాళ ఎగ్జిట్ పోల్స్ వెలువడనున్నాయి... ఎలా వుండునున్నాయంటే... 

Lok Sabha Elections 2024 Exit Polls Released Today AKP
Author
First Published Jun 1, 2024, 10:52 AM IST | Last Updated Jun 1, 2024, 11:37 AM IST

లోక్ సభ ఎన్నికలు క్లైమాక్స్ కు చేరుకున్నాయి. దేశవ్యాప్తంగా 543 లోక్ సభ స్థానాలతో పాటు ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు 7 దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఆరు దశల ఎన్నికలు పూర్తవగా ఇవాళ(శనివారం) చివరి దశ పోలింగ్ జరుగుతోంది. జూన్ 4న అంటే రాబోయే మంగళవారం ఫలితాలు వెలువడనున్నాయి.  అయితే ఈ ఫలితాల కంటే ఇవాళ సాయంత్రం వెలువడే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపైనే ఎక్కువ ఆసక్తి నెలకొంది. కొన్ని సంస్థలు చాలా శాస్త్రీయంగా సర్వే చేపట్టి ఓటర్ నాడి పడుతున్నాయి... అలాంటి ఎగ్జిట్ పోల్స్ తుది ఫలితాలకు చాలా దగ్గరగా వుంటున్నాయి. దీంతో ఫలితాల కోసం ఎదురుచూసే రాజకీయ పార్టీలు, అభ్యర్థులే కాదు ప్రజలు కూడా ఎగ్జిట్ పోల్స్ తో ఓ నిర్దారణకు వస్తున్నారు. 

అసలు ఏమిటి ఎగ్జిట్ పోల్స్ :  

ప్రజాస్వామ్యంలో ఎన్నికలదే కీలక పాత్ర. తమను పాలించేవారిని ప్రజలే ఎన్నుకుంటారు. ఇలా ప్రజాభిప్రాయాన్ని తెలుసుకునేందుకు నిర్వహించేవే ఎన్నికలు. పంచాయితీ సర్పంచ్ నుండి దేశ ప్రధాని ఎవరన్నది ఈ ఎన్నికలే నిర్ణయిస్తాయి. అయితే కొన్ని స్థానిక ఎన్నికల్లో పోలింగ్ ముగియగానే ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడిస్తారు. కానీ రాష్ట్రాల అసెంబ్లీల్లో, దేశవ్యాప్తంగా జరిగే లోక్ సభ ఎన్నికల్లో పోలింగ్ రోజే ఫలితాల వెల్లడి అసాధ్యం. అందువల్లే పోలింగ్ కు, ఫలితాల వెల్లడికి మధ్య కొంత సమయం వుంటుంది... ఈ సమయంలోనే ఎన్నికల వేళ పరిస్థితులు, ప్రజాభిప్రాయాన్ని సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించి ఏ పార్టీకి గెలిచే అవకాశాలున్నాయి... ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో కొన్ని సంస్థలు అంచనా వేస్తాయి. వీటినే ఎగ్జిట్ పోల్ పలితాలు అంటారు. 

కేవలం ఎన్నికల సర్వేలు నిర్వహించి ఎగ్జిట్ పోల్స్ కోసమే పనిచేందుకు కొన్ని సంస్థలు ఏర్పడ్డాయి. జాతీయ స్థాయిలోనే కాదు రాష్ట్రాల పరిధిలో జరిగే ఎన్నికలపైనా ఈ సంస్థలు సర్వే చేపడుతుంటాయి. కొన్ని సర్వే సంస్థలు ప్రముఖ మీడియాతో కలిసి ఎగ్జిట్ పోల్స్ నిర్వహిస్తున్నాయి. ప్రస్తుతం ప్రతి ఎన్నికల్లోనూ ఎగ్జిట్ పోల్స్ సర్వసాధారణంగా మారాయి. 

ఎగ్జిట్ పోల్స్ అలా మొదలయ్యాయి :

బ్రిటీష్ పాలనలోనూ భారతదేశంలో కొన్ని రకాల ఎన్నికలు జరిగేవి. ఇలా 1937 లో యునైటెడ్ ప్రొవెన్షియల్ ఎన్నికలు జరిగాయి. ఈ సమయంలోనే పక్కా లోకల్ పద్దతిలో విజయం ఎవరిదో ముందుగానే అంచనా వేసేందుకు మొదటిసారి ఎగ్జిట్ పోల్ సర్వే చేపట్టారు. తమకు ఓటు వేసినవారు ఓ కర్రను తీసుకువచ్చి పోలింగ్ స్టేషన్ సమీపంలో వేయాలంటూ సరికొత్త ప్రయోగానికి కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టింది. ఓటింగ్ పూర్తయ్యాక ఆ కర్రలన్నింటికి లెక్కించి తమకు ఎన్ని ఓట్లు వచ్చాయో అంచనా వేసింది. ఇదే ఆ తర్వాత ఎగ్జిట్ పోల్స్ సర్వేగా మారాయి.  

ఇక స్వాతంత్య్రం తర్వాత 1957లో జరిగిన సార్వత్రిక ఎన్నికల నుండే ఎగ్జిట్ పోల్స్ ప్రారంభమయ్యాయి. అయితే ఓ శాస్త్రీయ పద్దతిలో ఎగ్జిట్ పోల్ సర్వే చేపట్టడం మాత్రం 1996 ఎన్నికల సమయంలో జరిగింది.  ప్రభుత్వ ప్రసార సంస్థ దూరదర్శన్ సిఎస్ డిఎస్ సహకారంతో సర్వే నిర్వహించి  ఫలితాలు ఎలా వుండనున్నాయో అంచనా వేసింది. ఆ తర్వాత చాలా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించడం ప్రారంభించాయి.

2014,2019 లోక్ సభ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పాయి... ఏం జరిగిందంటే..: 
 
గత రెండు లోక్ సభ ఎన్నికల్లోనూ బిజెపి నేతృత్వంలోని ఎన్డిఏ కూటమి ఘనవిజయం సాధించింది. 2014 లో కాంగ్రెస్ ను ఓడించి అధికారంలోకి వచ్చిన బిజెపి 2019 లో అంతకంటే భారీ మెజారిటీతో విజయం సాధించింది. అయితే ఈ రెండు ఎన్నికల్లోనూ చాలా ఎగ్జిట్ పోల్స్ కూడా ఈ పలితాన్ని ముందుగానే అంచనా వేసాయి. సీట్ల విషయంలో కాస్త తేడా వున్నా గెలుపు విషయంలో ఎగ్జిట్ పోల్స్ నిజమయ్యాయి. 

2014 లో టైమ్స్ నౌ, ఇండియా టుడే, ఏబిపి, ఇండియా టీవి, ఎన్డిటివి వంటి ప్రముఖ మీడియా సంస్థల ఎగ్జిట్ పోల్స్ అంచనాలే నిజమయ్యాయి.  న్యూస్ 24 చాణక్య అయితే ఎన్డిఏ కూటమికి ఎన్ని సీట్లు వస్తాయో కూడా ఖచ్చితంగా చెప్పింది. ఎన్డిఏకు 340 సీట్లు వస్తాయని చెబితే... 336 సీట్లు వచ్చాయి. మిగతా సంస్థలు కూడా ఎన్డిఏ గెలుస్తుందని చెప్పినా ఇంత ఖచ్చితంగా సీట్లను మాత్రం అంచనా వేయలేకపోయింది. 

2019 లోక్ సభ ఎన్నికల్లోనూ న్యూస్ 24 చాణక్యతో పాటు ఇండియా టుడే కూడా ఎన్టీఏకు ఎన్నిసీట్లు వస్తాయో ఎగ్జిట్ పోల్స్ లోనే ఖచ్చితంగా చెప్పింది. ఇండియా టుడే ఎన్డీఏకు 339-365 సీట్లు, న్యూస్ 24 చాణక్య 350 సీట్లు వస్తాయని అంచనా వేస్తే తుది పలితాల్లో 353 సీట్లు వచ్చాయి. మిగతా సంస్థల ఎగ్జిట్ పోల్స్ కూడా ఎన్డీఏ విజయాన్ని ఎగ్జిట్ పోల్స్ లోనే చెప్పేసాయి.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios