2024 లోక్‌సభ ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమీషన్ షెడ్యూల్ ప్రకటించింది. ఈ సందర్భంగా దేశంలో ఎన్నికలు, ఓటర్లకు సంబంధించిన వివరాలను సీఈసీ రాజీవ్ కుమార్ వెల్లడించారు.
దేశవ్యాప్తంగా 97 కోట్ల మంది ఓటర్లుగా నమోదై వున్నారని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రాజీవ్ కుమార్. 2024 లోక్‌సభ ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఆయన శనివారం షెడ్యూల్ ప్రకటించారు. దేశంలో కోటీ 82 లక్షల మంది అభ్యర్ధుల తలరాతలను మార్చనున్నారు.
- 96.8 కోట్ల మంది ఓటు వేసేందుకు అర్హత
- దేశంలో కోటీ 82 లక్షల మంది కొత్త ఓటర్లు
- 19.47 కోట్ల మంది 20 నుంచి 29 ఏళ్ల మధ్య వయసున్నవారు
- పురుషులు 49.7 కోట్లు.. మహిళలు 47.1 కోట్లు, 48 వేల మంది ట్రాన్స్‌జెండర్లు
- దేశవ్యాప్తంగా 10.5 లక్షల పోలింగ్ స్టేషన్లు
- ఎన్నికల విధుల్లో 1.5 కోట్ల మంది ఉద్యోగులు
- ఎన్నికల కోసం 55 లక్షల ఈవీఎంలు సిద్ధం
- దేశవ్యాప్తంగా ఓటర్ల నిష్పత్తి ప్రతి 1000 మంది పురుషులకు 948 మహిళా ఓటర్లు.
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పురుషుల కంటే మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువ
- 85 ఏళ్ల వయసు మించిన ఓటర్లు దేశంలో 82 లక్షల మంది
- 100 ఏళ్లు పైబడిన ఓటర్లు 2.18 లక్షల మంది
- 88.4 లక్షల మంది దివ్యాంగ ఓటర్లు
- సీ విజిల్ యాప్‌ను ఉపయోగించి పౌరుల ఎన్నికలకు సంబంధించి సమాచారం, సలహాలు, సూచనలు, ఫిర్యాదులు చేయవచ్చు
- ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో రూ.3,400 కోట్లు సీజ్
- వాలంటీర్లు, కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎన్నికల విధల్లో వుండకూడదు
- బ్యాంక్ ఖాతాలు, లావాదేవీలపై ప్రత్యేక మానిటరింగ్
- సోషల్ మీడియా పోస్టుల నియంత్రణకు ప్రత్యేక అధికారుల నియామకం
- కుల, మతాన్ని రెచ్చగొట్టేలా స్పీచ్‌లు ఇవ్వకూడదు
- కులం, మతం పేరుతో ఎట్టి పరిస్ధితుల్లో ఓట్లు అడగరాదు
- ప్రచారాల్లో ఎట్టి పరిస్ధితుల్లో చిన్న పిల్లలు వుండకూడదు
- సూర్యాస్తమయం తర్వాత బ్యాంకుల క్యాష్ వ్యాన్లను సైతం అనుమతించబోం
