పార్లమెంట్ ఉభయ సభలు గురువారం నాడు నిరవధికంగా వాయిదా పడ్డాయి. బడ్జెట్ సమావేశాలు రెండు విడతలుగా జరిగిన విషయం తెలిసిందే.
న్యూఢిల్లీ: Parliamentఉభయ సభలు గురువారం నాడు నిరవధికంగా వాయిదా పడ్డాయి. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రెండు విడతలుగా జరిగాయి. ఇవాళ Loksabha, రాజ్యసభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి.
పార్లమెంట్ Budget 2022 సమావేశాలు ఈ ఏడాది జనవరి 31న ప్రారభం అయ్యాయి. తొలి రెండు రోజులు మినహా మిగతా రోజుల్లో పార్లమెంట్ ఉభయ సభలు వేర్వేరు సమయాల్లో షిఫ్టుల వారీగా పని చేశాయి.మరోవైపు గత ఏడాది మాదిరిగానే ఈ సారీ పేపర్లెస్ బడ్జెట్ ప్రవేశపెట్టింది ప్రభుత్వం.
రెండు దశల్లో బడ్జెట్ సమావేశాలు జరిగాయి. మొదటి దశ బడ్జెట్ సమావేశాలు జనవరి 31 నుంచి ఫిబ్రవరి 11 వరకు నిర్వహించారు.రెండో దశ బడ్జెట్ సమావేశాలు మార్చి 14 నుంచి ఏప్రిల్ 8 వరకు నిర్వహించారు.
తొలి రోజు పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి Ramnath Kovind ప్రసంగించారు.ఆ తర్వాత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆర్థిక సర్వేను ప్రవేశ పెట్టారు.
గత ఏడాది బడ్జెట్ సమయంలో పెట్టుకున్న లక్ష్యాలు, సాధించిన విజయాలతో వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆంచనాలతో కూడుకున్నదే ఆర్థిక సర్వే. ఈ సర్వేను ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు అధ్యక్షతన ఆర్థిక నిపుణులతో కూడిన బృందం తయారు చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ 2022 ను ప్రవేశ పెట్టారు.
ఫిబ్రవరి రెండవ తేదీన నుంచి ఉభయ సభలు వేర్వేరు సమాల్లో భేటీ కానున్నాయి. ఒక్కో సభ రోజుకు 5 గంటల చొప్పున మాత్రమే పని చేసింది.పార్లమెంట్ సిబ్బంది పెద్ద ఎత్తున కరోనా బారిన పడటం, ప్రస్తుతం దేశంలో భారీగా కొవిడ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది పార్లమెంట్ వ్యవహారాల విభాగం.మొదట షిఫ్టులో రాజ్య సభ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు భేటీ అయింది.ఆ తర్వాత రెండో షిఫ్టులో సాయంత్రం 4 గంటల నంచి రాత్రి 9 గంటల వరకు లోక్ సభ సమావేశాలు నిర్వహించారు.
