Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాద్ తో సహా మరో 12 నగరాల్లో కట్టుదిట్టంగా జూన్ 1 నుంచి లాక్ డౌన్ 5

దేశవ్యాప్తంగా విధించిన నాలుగవ దఫా లాక్ డౌన్ ఈ నెల 31 వ తేదీతో ముగియవస్తోంది. ఈ సందర్భంగా 5వ దఫా లాక్ డౌన్ కి కూడా కేంద్రం పావులు కదుపుతోంది. 5వ దఫా లాక్ డౌన్ జూన్ 1 నుంచి రెండు వారాలపాటు విధించనున్నట్టు తెలియస్తుంది. 

Lockdown5 To Be Strictly Implemented in Hyderabad And 12 More Cities
Author
Hyderabad, First Published May 30, 2020, 11:35 AM IST

దేశవ్యాప్తంగా విధించిన నాలుగవ దఫా లాక్ డౌన్ ఈ నెల 31 వ తేదీతో ముగియవస్తోంది. ఈ సందర్భంగా 5వ దఫా లాక్ డౌన్ కి కూడా కేంద్రం పావులు కదుపుతోంది. రెండవ దఫా తో పోల్చుకుంటే మూడవదఫా లాక్ డౌన్ లో, దానితో పోల్చుకుంటేనాలుగవ దఫా లాక్ డౌన్ లో మరిన్ని వెసులుబాట్లు కల్పించారు. 5వ దఫా లాక్ డౌన్ జూన్ 1 నుంచి రెండు వారాలపాటు విధించనున్నట్టు తెలియస్తుంది. 

ఈ సారి లాక్ డౌన్ ను హైదరాబాద్ తోపాటుగా మరో 12 నగరాల్లో మరింత కఠినంగా అమలు చేయాలని భావిస్తున్నట్టుగా తెలియవస్తుంది. హైదరాబాద్, ముంబై, చెన్నై, ఢిల్లీ, కోల్కతా,అహ్మదాబాద్, థానే, పూణే, ఇండోర్, జైపూర్, జోధ్ పూర్, చెంగల్పట్టు, తిరువళ్లూరు. మొత్తం దేశవ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల్లో ఈ నగరాల్లోనే 70 శాతం కేసులు నమోదవడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలియవస్తుంది. 

శుక్రవారం నాడు ప్రధాని నరేంద్రమోడీని కలిసి కూడా హోమ్ మంత్రి అమిత్ షా ఇదే విషయం చెప్పినట్టుగా తెలియవస్తుంది. అమిత్ షా ఇప్పటికే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఈ విషయమై మాట్లాడారు కూడా. 

ఈ సారి విధించే లాక్ డౌన్ లో మరిన్ని మినహాయింపులు ఇవ్వాలని కేంద్రం భావిస్తున్నట్టు తెలియవస్తుంది. ఈ సారి లాక్ డౌన్ లో ప్రార్థన మందిరాలకు అనుమతులు ఇవ్వనున్నట్టు సమాచారం అందుతుండగా, షాపింగ్ మాల్స్, హోటల్స్ కి మాత్రం అనుమతులు లభించే ఆస్కారం కనబడడం లేదు. 

మెట్రో రైళ్లు నడపడానికి కూడా కేంద్రం సుముఖంగా లేనట్టు తెలియవస్తుంది. కంటైన్మెంట్ జోన్లు ఈ మెట్రో మార్గ మధ్యంలో ఉండడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలియవస్తుంది. వచ్చే రెండు వారాలపాటు అన్ని విద్యాసంస్థలు కూడా మూసే ఉంటాయని ప్రభుత్వ వర్గాల నుండి అందుతున్న సమాచారం. 

ఈ ఈదఫా లాక్ డౌన్ ఇంతకుమునుపులా కఠినంగా మాత్రం ఉండబోదని, ఫిజికల్ డిస్టెంసింగ్ పాటించడం, మాస్కులను ధరించడం ఇవన్నీ కూడా ప్రజల మేలుకొరకే అని ప్రజలకు తెలిపి వారినే తగు విధంగా జాగ్రత్తలను తీసుకొమ్మని చెప్పనున్నట్టు తెలియవస్తుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios