రాష్ట్రంలో లాక్‌డౌన్ ను ఈ ఏడాది జూన్ 1 వతేదీ వరకు మహారాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది.  రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు గాను ఉద్దవ్ ఠాక్రే సర్కార్ లాక్‌డౌన్ ను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో కఠిన ఆంక్షలు అమలు చేసినా ఫలితం లేకపోవడంతో మహారాష్ట్ర ప్రభుత్వం  లాక్‌డౌన్ ను అమలు చేసింది. ఈ నెల 15వ తేదీ వరకు లాక్‌డౌన్ విధించింది.  లాక్‌డౌన్ విధించడంతో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో  రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్ ను పొడిగించాలని నిర్ణయం తీసుకొంది. 

&n

bsp;

 

రాష్ట్రంలోకి ప్రవేశించాలంటే ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో కరోనా నెగిటివ్ సర్టిఫికెట్ ఉంటేనే అనుమతి ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం  ప్రకటించింది. దేశంలో కరోనా కేసులు అత్యధికంగా నమోదౌతున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర అగ్రస్థానంలో నిలిచింది.  బుధవారం నాడు రాష్ట్రంలో 30 వేల కరోనా కేసులు నమోదయ్యాయి.  జాతీయ సగటులో ఇది 0.8 శాతంగా ఉందని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ తోపే చెప్పారు. దేశంలో కరోనా కేసుల రేటు 1.4 శాతం ఉంటే, మహారాష్ట్రలో కరోనా కేసుల రేటు 0.8 శాతంగా ఉంది. రాష్ట్రంలో రెండున్నర లక్షలమందికి రోజూ కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు.