Asianet News TeluguAsianet News Telugu

లాక్‌డౌన్ మే 31తో ముగుస్తుందని చెప్పలేం, రానున్న రోజుల్లో మరిన్ని జాగ్రత్తలు: సీఎం

మే 31వ తేదీతో లాక్ డౌన్ ముగుస్తుందని చెప్పలేం, రానున్న రోజుల్లో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే చెప్పారు.

Lockdown May Not End On May 31, Need Time For Flights: Uddhav Thackeray
Author
Mumbai, First Published May 24, 2020, 3:43 PM IST


న్యూఢిల్లీ: మే 31వ తేదీతో లాక్ డౌన్ ముగుస్తుందని చెప్పలేం, రానున్న రోజుల్లో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే చెప్పారు.

ఆదివారం నాడు ఆయన ముంబైలో  మీడియాతో మాట్లాడారు. మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతున్నాయన్నారు. రాబోయే రోజులు అత్యంత కీలకమైనవిగా ఆయన అభిప్రాయపడ్డారు. 

అయితే భయపడాల్సిన అవసరం లేదన్నారు.కరోనాను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్దమైందని ఆయన తేల్చి చెప్పారు.మహారాష్ట్రలో 47,190 కరోనా కేసులు నమోదయ్యాయి. దేశంలో 1,31,868 కేసులు నమోదైన విషయం తెలిసిందే.

కేంద్ర సివిల్ ఏవియేషన్  మంత్రి హరీదీప్ సింగ్ పూరితో మాట్లాడాను. విమానాలు నడపడం అవసరమే. కానీ, విమానాలు నడపడానికి తమ రాష్ట్రంలో విమానాల రాకపోకలను పునరుద్దరించడానికి తాము ప్రిపేర్ కావడానికి ఇంకా సమయం అవసరమని ఆయన చెప్పారు.రానున్న 15 రోజుల పాటు అత్యంత కీలకమైనవన్నారు. 

రాష్ట్రంలో దశలవారీగా లాక్ డౌన్ ఎత్తివేస్తామన్నారు సీఎం. తొలుత వైరస్ ను అరికట్టడమే తమ ముందున్న కర్తవ్యమన్నారు ఠాక్రే. రాష్ట్రంలోని ప్రజలను ఆదుకొనేందుకు ప్యాకేజీని ప్రకటిస్తామని సీఎం తెలిపారు.

also read:బీకేర్‌ఫుల్:రేపటి నుంచి ఫ్లయిట్స్ టేకాఫ్! శంషాబాద్ నుంచి కూడా!!

ఈ నెల 25వ తేదీ నుండి దేశీయ విమానాల రాకపోకలు ప్రారంభించాలని కేంద్ర విమానాయాన మంత్రిత్వశాఖ నిర్ణయం తీసుకొన్న విషయం తెలిసిందే. అయితే మహారాష్ట్ర ప్రభుత్వం మాత్రం విమానాల రాకపోకలకు సిద్దంగా లేదు. 

తమిళనాడు, మహారాష్ట్ర, బెంగాల్ రాష్ట్రాలు విమానాల రాకపోకలకు సిద్దంగా లేవు. తమిళనాడు, మహారాష్ట్రల్లో కరోనా కేసులు ఎక్కువగా ఉన్నందున విమనాల రాకపోకలను అనుమతించడం లేదు. బెంగాల్ రాష్ట్రంలో అంఫన్ తుఫాన్ కారణంగా విమాన రాకపోకల విషయమై బెంగాల్ ఇంకా సానుకూలంగా స్పందించలేదు.
 

Follow Us:
Download App:
  • android
  • ios