Asianet News TeluguAsianet News Telugu

కేంద్రం విడుదల చేసిన లాక్ డౌన్ మార్గదర్శకాలు ఇవీ....

కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ మార్గదర్శకాలను జారీ చేసింది. ఏప్రిల్ 20వ తేదీ తర్వాత ఆ మార్గదర్శకాలు అమలులోకి వస్తాయి. లాక్ డౌన్ మార్గదర్శకాలను విడుదల చేస్తామని ప్రధాని మోడీ చెప్పిన విషయం తెలిసిందే.
Lockdown guidelines issued by Union government
Author
New Delhi, First Published Apr 15, 2020, 10:10 AM IST
న్యూఢిల్లీ: భారత ప్రభుత్వం లాక్ డౌన్ మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మార్గదర్శకాలు ఏప్రిల్ 20వ తేదీ తర్వాత అమలులోకి వస్తాయి. ఈ నెల 20వ తేదీ వరకు లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తామని, ఆ తర్వాత కొన్ని సడలింపులు ఉంటాయని ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారంనాడు జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో తెలిపిన విషయం తెలిసిందే.

ఆ మార్గదర్శ సూత్రాలు ఇవీ.....

* పబ్లిక్ లో కచ్చితంగా మాస్కులు ధరించాలి.
* రాష్ట్రాల మధ్య అన్ని రకాల రవాణాలు బంద్
* వ్యవసాయ, అనుబంధ రంగాలకు అనుమతి
* పరిమితంగా నిర్మాణ రంగానికి అనుమతి
* కాఫీ, తేయాకు తోటల్లో 50 శాతం మ్యాన్ పవర్ కు అనుమతి 
* నిర్మాణ రంగం పనులకు స్థానిక కార్మికులకు మాత్రమే అనుమతి
* గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమలకు అనుమతి
* పట్టణ పరిధిలో లేని పుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు అనుమతి
*హాట్ స్పాట్లను ప్రకటించే అధికారం రాష్టాలదే
* హాట్ స్పాట్లలో జనసంచారం ఉండకూడదు
* కేంద్ర ప్రభుత్వం అనుమతించిన విధులకు హాజరయ్యేవారికి ప్రత్యేక వాహనాలు సమకూర్చాలి
* ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లలో శానిటైజ్ తప్పనిసరి
* కార్యాలయాల్లో ఒకరికొకరికి మధ్య ఆరు అడుగుల దూరం ఉండాలి
* మే 3 వరకు రాష్ట్రాల మధ్య అన్ి రకాల రవాణా బంద్
* వాహనాల్లో 30 నుంచి 40 మంది మాత్రమే ప్రయాణించాలి.
* విధులు నిర్వహించే వారికి మెడికల్ ఇన్సూరెన్స్ తప్పనిసరి
* మత ప్రార్థనలు, దైవ కార్యక్రమాలు నిషేధం
* అన్ని రకాల ఈ - కామర్స్ కార్యక్రమాలకు అనుమతి
* సోషల్ డిస్టెన్స్ పాటించే విధంగా షిఫ్ట్ లు మారే సమయంలో గంట వ్యవధి
* లిక్కర్, గుట్కా, పొగాకు ఉత్పత్తులపై నిషేధం
* విధులు నిర్వహించే వాహనాలను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేయాలి
* విద్యా సంస్థల కార్యక్రమాలు రద్దు
*సభలు, సమావేశాలకు అనుమతి ఉండదు
*బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మితే జరిమానా
*పబ్ లు, స్విమ్మింగ్ పూల్స్, మాల్స్ పై ఆంక్షల కొనసాగింపు
* అంత్యక్రియలకు 20 మందికి మాత్రమే అనుమతి

భారతదేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య నిత్యం పెరుగుతోంది. దేశంలో ఇప్పటి వరకు 11,439 కేసులు నమోదయ్యాయి. మృతుల సంఖ్య 377కు చేరుకుంది. గత 24 గంటల్లో కొత్తగా 38 మరణించారు. తాజాగా మరో 1,076 కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. 

మహారాష్ట్రలో అత్యధికంగా 2,337 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత స్థానం ఢిల్లీ ఆక్రమించింది. ఢిల్లీలో 1,510 కేసులు రికార్డయ్యాయి. తమిళనాడు 1,173 కేసులతో మూడో స్థానంలో నిలిచించింది. 
Follow Us:
Download App:
  • android
  • ios