Asianet News TeluguAsianet News Telugu

ఇళ్లు లేని ఎమ్మెల్యే.. చందాలతో ఇళ్లు కట్టించిన ప్రజలు

తమ సమస్యల పరిష్కారం కోసం ఎంతగానో కృషి చేసిన తమ శాసనసభ్యుని కోసం ఆ నియోజకవర్గ ప్రజలు ఇంటిని కట్టించారు. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా షియోపూర్ జిల్లా విజయ్‌పూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్ధిగా బరిలోకి దిగిన సీతారామ్ ఆదివాసికి ఉండటానికి ఇళ్లు లేదు. 

local residents build house for mla in madhya pradesh
Author
Madhya Pradesh, First Published Jan 30, 2019, 1:53 PM IST

తమ సమస్యల పరిష్కారం కోసం ఎంతగానో కృషి చేసిన తమ శాసనసభ్యుని కోసం ఆ నియోజకవర్గ ప్రజలు ఇంటిని కట్టించారు. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా షియోపూర్ జిల్లా విజయ్‌పూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్ధిగా బరిలోకి దిగిన సీతారామ్ ఆదివాసికి ఉండటానికి ఇళ్లు లేదు.

ఎన్నికల అఫడవిట్‌లో 5 లక్షలు విలువచేసే 2 ఎకరాల భూమి, 600 గజాల ఇంటి స్థలం, రూ. 46,733 నగదు మాత్రమే ఉందని ఎన్నికల సంఘానికి తెలిపాడు. ఆర్ధిక ఇబ్బందుల కారణంగా ఎమ్మెల్యేగా ఎన్నికైనా భార్యతో కలిసి పూరి గుడిసెలో నివసిస్తున్నాడు.

తమ నియోజకవర్గ ఎమ్మెల్యే పూరి గుడిసెలో ఉండటాన్ని తట్టుకోలేకపోయిన జనం చందాలు వేసుకుని మరి ఆయనకు ఇళ్లు కట్టిస్తున్నారు. సీతారామ్ కష్టకాలంలో కూడా తమకు అండగా ఉన్నారని.. ఆయన చాలా మంచి వారని జనం అంటున్నారు.

ఇంటి నిర్మాణంపై ఎమ్మెల్యే సీతారామ్ స్పందించారు. జనం నాకు చందాలిచ్చి మరి ఇళ్లు కట్టిస్తున్నారు. తన చాలా పేద కుటుంబమని, ఇటీవల ఎన్నికల్లో గెలిచినందుకు చిల్లర నాణేలతో ప్రజలు తులాభారం వేశారన్నారు.

ఆ డబ్బుతో గుడిసె కట్టుకున్నానని.. ఇప్పుడు వారే ముందుకొచ్చి చందాలతో ఇళ్లు కట్టిస్తుండటం సంతోషంగా ఉందన్నారు. తనకు వచ్చే తొలి జీతం రూ. లక్షా పదివేలను ప్రజల సంక్షేమం కోసమే ఖర్చు చేస్తానని హామీ ఇచ్చారు.

అలాగే ఆయన భార్య ఇమార్తి భాయ్ మాట్లాడుతూ... విజయ్‌పూర్ ప్రజలు తన భర్తపై ప్రేమను చూపిస్తారని.. ఆయన వారి సమస్యలపై నిరంతరం పోరాడుతారని చెప్పారు. గతంలో రెండు సార్లు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన సీతారామ్.. మూడోసారి విజయాన్ని సాధించారు. ఈ ఎన్నికల్లో రాష్ట్ర కాంగ్రెస్‌లో కీలకనేత రామ్‌నివాస్ రావత్‌పై స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios