Asianet News TeluguAsianet News Telugu

నృత్యం చేస్తూ ఒక్క‌సారిగా కుప్ప‌కూలిన దేవత నృత్యకారుడు.. క్ష‌ణాల్లోనే..

Dakshina Kannada: కర్ణాటకలో లైవ్ పెర్ఫార్మెన్స్ ఇస్తుండ‌గా ఒక్కసారిగా కుప్పకూలి స్థానిక డ్యాన్సర్ మృతి చెందాడు. కర్ణాటకలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. ద‌క్షిణ కన్నడ జిల్లాలో దైవ నర్తక అని పిలువబడే స్థానిక దేవత నృత్యకారుడు ప్రదర్శన మధ్యలో కుప్పకూలి ప్రాణాలు కోల్పోయారు.
 

Local dancer collapses during live performance in Dakshina Kannada,  Karnataka, dies RMA
Author
First Published Mar 30, 2023, 5:10 PM IST

Local dancer collapses during live performance: ఇటీవ‌లి కాలంలో అప్ప‌టివ‌ర‌కు ఆరోగ్యంగా ఉండి.. ఒక్క‌సారిగా కుప్ప‌కూలిపోయి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య క్ర‌మంగా పెరుగుతున్న‌ద‌ని రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఇదే క్ర‌మంలో మ‌రో విషాద‌క‌ర ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఒక ఆల‌య స‌మీపంలో నృత్యం చేస్తున్న క్ర‌మంలో స్థానిక నృత్య‌కారుడు ఒక్క‌సారిగా కుప్ప‌కూలిపోయాడు. చూస్తుండ‌గానే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘ‌ట‌న కర్ణాటకలో చోటుచేసుకుంది. 

వివ‌రాల్లోకెళ్తే.. కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో ఒక ప్రదర్శన మధ్యలో కుప్పకూలి స్థానిక దేవత నృత్యకారుడు (దైవ నర్తక) మరణించాడు. మృతుడు కడబ తాలూకా ఎడమంగళకు చెందిన కంతు (60)గా గుర్తించారు. ఇద్యాద్కా గ్రామంలో సాంప్ర‌దాయ‌క‌ ఆచార నృత్య ప్రదర్శనలు జరుగుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రదర్శన ఇస్తున్న సమయంలో డ్యాన్సర్ అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడనీ, అతన్ని బతికించడానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

కోలా అనే మతపరమైన వేడుకలో భాగంగా ఈ నృత్య ప్రదర్శన జరిగింది. ఇక్కడ భక్తులు దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి సాంప్రదాయ నృత్యాలను ప్రదర్శిస్తారు. ఉల్లాకులు, నాగబ్రహ్మ దేవతలకు ఆచార నృత్యాలు చేసిన షిరాడీ దేవత నృత్య ప్రదర్శన సందర్భంగా ఈ సంఘటన జరిగింది.

 

 

Follow Us:
Download App:
  • android
  • ios