చెన్నై:  ఆన్‌లైన్ మనీ యాప్ ముఠాను చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. ఎం రూపీ పేరుతో మాప్ నిర్వహిస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. 

రూ. 5వేల లోన్‌కు రూ. 3500 వడ్డీని వసూలు చేస్తున్నట్టుగా బాధితులు తెలిపారు. వడ్డీని సకాలంలో చెల్లించని బాధితుల ఇండ్లలోని వస్తువులను జప్తు చేస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు.

తెలుగు రాష్ట్రాల్లో ఈ తరహా  ఘటనలు ఇటీవల చోటు చేసుకొన్నాయి. ఇదే తరహా ఘటన చెన్నైలో కూడా చోటు చేసుకొన్నాయని స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు చెన్నైలో చైనాకు చెందిన ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. చైనా యువకులతో పాటు మరికొందరు స్థానిక యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టైన వారిలో దూపనహళ్లికి ఎస్. ప్రమోదా, కర్ణాటకలోని చిక్కనహళ్లికి చెందిన సిఆర్. పవన్, జియా యా మౌ, యువన్ లూన్ గా గుర్తించారు. 

ఈకేసులో చైనా పౌరులు హాంగ్ , వండిష్ రెండే  వారాల క్రితం సింగపూర్ కు పారిపోయినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. చైనా పౌరులు వు యువన్ లున్, జియా యా మౌలాను బెంగుళూరులో పోలీసులు అరెస్ట్ చేశారు.

ఇన్‌స్టంట్ లోన్ యాప్ ల పేరుతో నిర్వాహకులు లోన్ తీసుకొన్నవారిని వేధింపులకు గురి చేస్తున్నారు. ఈ వేధింపులు భరించలేక తెలుగు రాష్ట్రాల్లో పలువురు ఆత్మహత్యలు చేసుకొన్న విషయం తెలిసిందే.

ఈ యాప్ లపై అందిన ఫిర్యాదుల మేరకు  తెలుగు రాష్ట్రాల్లో సుమారు వంద మందిని అరెస్ట్ చేశారు. వీరిలో చైనాకు చెందిన కీలక సూత్రాధారి లాంబో ను కూడ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.