Asianet News TeluguAsianet News Telugu

నిన్న పార్టీ నుంచి తొలగింపు.. నేడు ఎంపీ ప్రిన్స్ రాజ్ పై లైంగిక ఆరోపణలు

ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులు స్పందించారు. తమకు ఫిర్యాదు అందిందని.. దర్యాప్తు చేస్తున్నామని.. అయితే ఇప్పటి వరకు ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు కాలేదని చెప్పడం గమనార్హం. 

LJP crisis takes a new twist, woman accuses Prince Raj of sexual assault, complaint lodged
Author
Hyderabad, First Published Jun 16, 2021, 2:44 PM IST

ఎల్జేపీ( లోక్ జన శక్తి పార్టీ) ఎంపీ ప్రిన్స్ రాజ్ కి ఊహించని షాక్ ఎదురైంది. ఆయనపై ఓ మహిళ లైంగిక ఆరోపణలు చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఢిల్లీలో ఈ పోలీసు కేసు నమోదైంది. ప్రిన్స్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు సదరు మహిళ ఫిర్యాదు చేయడం గమనార్హం.

సదరు మహిళ ఫిర్యాదు చేసిన రోజునే.. చిరాగ్ పాశ్వాన్ సైతం ట్విట్టర్ లో ఓ ట్వీట్ చేయడం గమనార్హం.. తమ పార్టీకి చెందిన ఓ మహిళా నాయకురాలిని ప్రిన్స్ రాజ్ లైంగిక వేధించారనే విషయాన్ని తెలియజేస్తూ.. ఆయన ట్వీట్ చేశారు.

కాగా.. ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులు స్పందించారు. తమకు ఫిర్యాదు అందిందని.. దర్యాప్తు చేస్తున్నామని.. అయితే ఇప్పటి వరకు ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు కాలేదని చెప్పడం గమనార్హం. 

ప్రిన్స్ రాజ్ దివంగత రామ్ చంద్ర పాస్వాన్ కుమారుడు,  రామ్ విలాస్ పాస్వాన్ .. (ఎల్జెపి వ్యవస్థాపకుడు, చిరాగ్ పాశ్వాన్  తండ్రి.) కి సోదరుడు. రామ్ చంద్ర పాస్వాన్ కన్నుమూసిన తరువాత, ప్రిన్స్ రాజ్ సమస్తిపూర్ నుండి పోటీ చేయగా.. చిరాగ్ పాస్వాన్ అతని కోసం ప్రచారం చేశాడు.

కాగా.. ఇటీవల చిరాగ్ పాశ్వాన్ కి వ్యతిరేకంగా ఐదుగురు ఎంపీలు వ్యవహరించారు. తిరుగుబావుటా ఎగరేసిన ఐదుగురు ఎంపీలను పార్టీ నుంచి తొలగిస్తున్నట్లు లోక్‌ జనశక్తి పార్టీ(ఎల్‌జేపీ) ప్రకటించింది. పశుపతి పరాస్, ప్రిన్స్ రాజ్, చందన్ సింగ్, వీనా దేవి, మెహబూబ్‌ అలి కేశార్ అనే ఐదుగురు ఎంపీలు చిరాగ్‌కు వ్యతిరేకమయ్యారు. చిరాగ్‌ను ఒంటరిని చేసి పరాస్‌ నేతృత్వంలో ఐదుగురు ఎంపీలు చిరాగ్‌కు వ్యతిరేకమయ్యారు. ఈ నేపథ్యంలో వారిపై వేటు వేశారు. వావరిలో ప్రిన్స్ రాజ్ కూడా ఉన్నారు. ఇలా పార్టీ నుంచి తొలగించిన తర్వాతే ఆయనపై లైంగిక ఆరోపణలు రావడం తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios