న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీజేపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి ఎల్ కే అద్వానీని ఆదివారం నాడు కలిశారు.

అద్వానీ పుట్టిన రోజును పురస్కరించుకొని  మోడీ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కార్యకర్తలకు అద్వానీ కృషిని మరవలేమన్నారు. అద్వానీని లివింగ్ ఇన్సిపిరేషన్ ఇచ్చే నేతగా ఆయన అభినందించారు.

అద్వానీ ఇవాళ్టితో 93 ఏళ్లకు చేరుకొన్నాడు. అద్వానీని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలు కూడ  కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

దేశ అభివృద్ధితో పాటు పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో  మోడీ పాత్ర మరవలేమని మోడీ చెప్పారు. ట్విట్టర్ వేదికగా మోడీ అద్వానీకి శుభాకాంక్షలు తెలిపారు.

లక్షలాది పార్టీ కార్యకర్తలతో పాటు దేశంలోని చాలా మందికి ప్రత్యక్ష ప్రేరణ అని ఆయన అభిప్రాయపడ్డారు. అద్వానీకి ఆరోగ్యకరమైన జీవితం కోసం తాను ప్రార్ధిస్తున్నానని మోడీ ట్వీట్ చేశారు.

 

నిస్వార్ధ సేవ ద్వారా దేశాభివృద్ధికి తోడ్పడడమే కాకుండా బీజేపీ జాతీయవాద భావజాల విస్తరరణలో అద్వానీ కీలకపాత్ర పోషించారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా గుర్తు చేశారు. అద్వానీ పుట్టినరోజును పురస్కరించుకొని ఆయన ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.

అద్వానీ పుట్టినరోజును పురస్కరించుకొని పలువురు బీజేపీ నేతలు ఆయనకు శుభాకాంక్షలు ట్విట్టర్ వేదికగా చెప్పారు.

1972 నవంబర్ 8వ తేదీన అద్వానీ జన్మించారు. ప్రస్తుతం పాకిస్తాన్ లోని కరాచీలో ఆయన పుట్టాడు. భారత్, పాకిస్తాన్ విభజన తర్వాత అద్వానీ కుటుంబం ఇండియాకు తరలివచ్చింది.