ప్రమాదంలో ఉన్న కన్నతల్లిని కాపాడిన చిన్నారి.. వీడియో వైరల్...!
దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఆ చిన్నారి చేసిన పనికి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ఆ పిల్లాడిపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

మన కళ్ల ముందు ఎవరైనా ప్రమాదంలో పడితే..... వెంటనే స్పందించలేం. ఎందుకంటే.. వెంటనే షాక్ కి గురౌతూ ఉంటాం. కానీ... ఓ చిన్నారి మాత్రం.... ప్రమాదంలో పడిన తన తల్లిని వెంటనే రక్షించాడు. నిజానికి ఆ చిన్నారి వయసుకు అంత పెద్ద సహాయం చేయడం మామూలు విషయం కాదు. కానీ...తన శక్తికి మించి తన తల్లిని కాపాడేందుకు ప్రయత్నించాడు. చివరకు కాపాడాడు కూడా. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఆ చిన్నారి చేసిన పనికి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ఆ పిల్లాడిపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
పూర్తి వివరాల్లోకి వెళితే... ఐపీఎస్ అధికారి దీపాన్షు కాబ్రా ట్విట్టర్ లో ఈ వీడియోని షేర్ చేశాడు. డిసెంబర్ 23వ తేదీన ఈ వీడియోని షేర్ చేయగా.... చేసిన కొద్ది క్షణాల్లోనే వైరల్ గా మారింది. 43 సెకన్ల ఈ వీడియోలో ఓ మహిళ.... నిచ్చెన వేసుకొని పైకి ఎక్కి ఏదో చేస్తోంది. ఆమె అలా ఎక్కిందో లేదో... వెంటనే నిచ్చెన కిందకు పడిపోయింది. ఆమె... పైన దొరికన దానిని పట్టుకొని వేలాడుతూ ఉంది. వెంటనే... ఆమె కొడుకు... తన చిన్న చిన్న చేతులతో.... నిచ్చెన పైకి లేపి తల్లికి అందించడానికి సహాయం చేశాడు. ఆ పిల్లాడు చేసిన సహాయానికి నెటిజన్లు ఫిదా అయిపోయారు.