తాజాగా ఓ జంట తమ సంగీత్ వీడియోని తమ కుమారుడికి చూపించాడు. ఆ బుడ్డోడి రియాక్షన్ క్యాప్చర్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేయగా, అది కాస్త వైరల్ గా మారింది.

ఈ మధ్యకాలంలో అందరూ పెళ్లిని అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. పెళ్లి ఫోటోలు, వీడియోలు చాలా కామన్ అయిపోయాయి. ఇక పెళ్లిలో హల్దీ, మెహందీ, సంగీత్ కూడా చాలా సాధారణమైపోయాయి. సంగీత్ లో వధూ, వరులు సినిమాల్లో హీరో, హీరోయిన్ల రేంజ్ లో పాటలకు డ్యాన్స్ లు వేస్తున్నారు. తాజాగా ఓ జంట తమ సంగీత్ వీడియోని తమ కుమారుడికి చూపించాడు. ఆ బుడ్డోడి రియాక్షన్ క్యాప్చర్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేయగా, అది కాస్త వైరల్ గా మారింది.

పిల్లలు తమ తల్లిదండ్రుల వివాహ వేడుకలకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు చూడటం చాలా ఆసక్తిని కలిగిస్తుంది. ఈ క్లూ లేని చిన్న మనసులకు వాటిని చూసినప్పుడు చాలా ప్రశ్నలు వేస్తూ ఉంటాయి. చాలా మంది పిల్లలు ఆ వీడియోలో తాము ఎందుకు లేము అంటూ అమాయకంగా అడుగుతూ ఉంటారు.

View post on Instagram

తాజాగా, ఓ బుడ్డోడు మాత్రం తమ పేరెంట్స్ కి మంచి కాంప్లిమెంట్ ఇచ్చాడు. తమ పేరెంట్స్ సంగీత్ వీడియో చూశాడు. అందులో వారు ఓ హిందీ పాటకు డ్యాన్స్ వేస్తున్నారు. లోకేషన్స్, వారి కాస్ట్యూమ్స్ అన్నీ ఓ సినిమాను తలపించేలా ఉన్నాయి. ఆ వీడియోని చూసిన వారి కుమారుడు, మీరు అప్పటికీ ఇప్పటికీ ఏమీ మారలేదు. సేమ్ ఉన్నారు అంటూ కాంప్లిమెంట్ ఇచ్చాడు. దానిని వాళ్ల అమ్మ క్యాప్ఛర్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేయగా అది వైరల్ గా మారింది. దాదాపు 2 మిలియన్లకు పైగా వ్యూస్ రావడం విశేషం.

నెటిజన్ల రియాక్షన్ కూడా అదిరింది. వారి డ్యాన్స్ అద్భుతంగా ఉందని, ఓ సినిమాటిక్ ఫీల్ వచ్చిందని కామెంట్స్ చేస్తున్నారు. కొందరు మాత్రం ఆ బుడ్డోడి రియాక్షన్ కి ఫిదా అయిపోతున్నారు.