దీంతో, ఆమె నాలుగు పడకలు ఉన్న ఫ్లాట్ ని రెంట్ కి తీసుకోవాలని అనుకుంది. అయితే, ఆ ఫ్లాట్ రెంట్ విని ఆమె విస్తుపోయింది. 

ఉద్యోగాల కోసం, వ్యాపారాల కోసం చాలా మంది సొంత ఊళ్లను వదిలిపెట్టి, వేరే సిటీలకు వెళ్లాల్సి వస్తుంది. అలాంటి సమయంలో సొంత ఇల్లు ఉండవు కాబట్టి, అద్దె ఇళ్ల కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే, తాజాగా ఓ యువతి అద్దె ఇంటి కోసం వెతకుతుండగా, ఆమెకు ఊహించని షాక్ తగిలింది. నగరాల్లో ఇల్లు అద్దెకు తీసుకోవడం కూడా ఇంత కష్టమా అనిపించేలా ఆమెకు కలిగింది.

పూర్తి వివరాల్లోకి వెళితే, బెంగళూరు నగరంలో తేజస్వి శ్రీవాస్తవ అనే మహిళ ఇంటి అద్దె కోసం వెతుకుతోంది. దీనిలో భాగంగా ఆమెకు ఒక బిల్డింగ్ లో ఫ్లాట్ ఖాళీగా ఉన్నట్లు సమాచారం అందింది. దీంతో, ఆమె నాలుగు పడకలు ఉన్న ఫ్లాట్ ని రెంట్ కి తీసుకోవాలని అనుకుంది. అయితే, ఆ ఫ్లాట్ రెంట్ విని ఆమె విస్తుపోయింది.

ఆ ఫ్లాట్ లో అద్దెకు దిగాలంటే సెక్యూరిటీ డిపాజిట్ గా యజమానికి 25లక్షలు చెల్లించాలని తెలిసింది. ఇందుకోసం లోన్ కూడా అప్లై చేసుకోవచ్చట. ఈ విషయం విని ఆమె షాకైంది. తాను ఫ్లాట్ కొంటున్నానా లేక, అద్దెకు తీసుకుంటున్నానా అని ఆమె ఆశ్చర్యపోయింది. బెంగళూరు సిటీలో ఇల్లు అద్దెకు తీసుకోవడం ఇంత కష్టమా అని ఆమెకు అర్థమైంది. అయితే ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఈ ప్లాట్ ధర 25లక్షలు అని చెప్పడంతో పాటు కిడ్నీ కూడా డొనేట్ చేయమంటే సరిపోయేది అంటూ వ్యంగంగా సెటైర్ వేసింది.

ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియాలో షేర్ ఛేయగా, వైరల్ గా మారింది. కామెంట్ల వర్షం కురుస్తోంది. పాతిక లక్షలు అద్దెంటి అనికామెంట్స్ చేస్తున్నారు. కొందరు యజమానులు ముందుగానే పది నెలలకు అడ్వాన్స్ తీసుకుంటారని, అయితే, ఆ ఇంటి అద్దె నెలకు రెండున్నర లక్షలా అని కామెంట్స్ చేస్తున్నారు. ఆ పాతిక లక్షలకు ఏకంగా ఓ చిన్నపాటి ఇల్లే కొనుక్కోవచ్చు అని మరి కొందరు కామెంట్స్ చేస్తున్నారు.