Asianet News TeluguAsianet News Telugu

మందుబాబులకు శుభవార్త: మద్యం షాపులకు అనుమతులు!

లాక్ డౌన్ వేళ మందుబాబులకు మాత్రం కేంద్రం ఒక గుడ్ న్యూస్ తెలిపింది. మద్యం షాపులను నడుపుకునేందుకు రాష్ట్రాలకు కేంద్రం అనుమతులిచ్చింది.

Liquor shops can be opened in all zones following the guidelines
Author
Hyderabad, First Published May 1, 2020, 7:53 PM IST

లాక్ డౌన్ వేళ మందుబాబులకు మాత్రం కేంద్రం ఒక గుడ్ న్యూస్ తెలిపింది. మద్యం షాపులను నడుపుకునేందుకు రాష్ట్రాలకు కేంద్రం అనుమతులిచ్చింది. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడంపై మాత్రమే నిషేధం విధించింది.

మద్యం దుకాణాలు తమ కార్యకలాపాలను సాగించవచ్చు. ఎల్లప్పుడూ కూడా రెండుగజాల దూరాన్ని పాటిస్తూ ఒకేసారి షాప్ వద్ద 5గురు కన్నా ఎక్కువమంది ఉండకూడదు. 

ప్రభుత్వ ఆదేశాల ప్రకారం షాపింగ్ మాల్స్ లో కాకుండా సింగల్ గా ఉన్న అన్ని షాపులను కూడా తెరవవచ్చు అత్యవసరమా,కాదా అన్న తేడా లేకుండా. కాబట్టి ఏ జోన్ అయినా సరే సింగల్ గా ఉన్న మద్యం షాపులను తెరవడానికి మాత్రం అనుమతి దక్కినట్టయింది. హోమ్ మంత్రిత్వ శాఖ కొద్దిసేపటికింద దీనిపై క్లారిటీ ఇస్తూ... కేవలం ఆరెంజ్, గ్రీన్ జోన్లలో మాత్రమే అనుమతులిచ్చింది. 

అన్ని రాష్ట్రాలు కూడా పూర్తిగా నష్టపోయి ఉన్నందున కేంద్రాన్ని ఇందుకు సంబంధించి పర్మిషన్ ను కోరింది. కేంద్రం కూడా అందుకు సమ్మతించి వారి ప్రధాన ఆదాయ మార్గాలను తెరుచుకోవడానికి అనుమతులిచ్చింది. 

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కేంద్రం మరో రెండు వారాల పాటు లాక్ డౌన్ ను పొడగించారు. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 3వ తేదీ వరకు కేంద్రం రెండో విడత లాక్ డౌన్ విధించింది. 3వ తేదీ తర్వాత కేంద్రం లాక్ డౌన్ ను సడలించవచ్చునని భావించారు. అయితే, మరో రెండు వారాల పాటు లాక్ డౌన్ ను పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది.

ఈ నెల 17వ తేదీ వరకు లాక్ డౌన్ ను పొడగిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఆరెంజ్, గ్రీన్ జోన్లకు కొన్ని సడలింపు ఇస్తూ లాక్ డౌన్ ను కొనసాగించాలని కేంద్రం నిర్ణయించింది. రెడ్ జోన్లలో కంటైన్మెంట్ నిబంధనలు కొనసాగుతాయి. తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 7వ తేదీ వరకు లాక్ డౌన్ ను పొడగించింది. పలు రాష్ట్రాల్లో కరోనా వైరస్ కట్టడి కాని పక్షంలో లాక్ డౌన్ ను పొడగించాలని కేంద్రం నిర్ణయించినట్లు భావించవచ్చు.. 

విమాన, రైలు, మెట్రో ప్రయాణాలపై, రోడ్డు మార్గంలో అంతర్రాష్ట్ర ప్రయాణాలపై నిషేధం కొనసాగుతుంది. విద్యాసంస్థలు, హాస్పిటాలిటీ సర్వీసులపై, సామూహిక కార్యక్రమాలపై నిషేధం కొనసాగుతుంది. సినిమా హాల్స్, మాల్స్, జిమ్స్, క్రీడా సముదాయాలు మూసే ఉంటాయి. ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే విమానాలు, రైళ్ల ద్వారా, రోడ్డు మార్గాల్లో ప్రయాణించడానికి అనుమతిస్తారు.

Follow Us:
Download App:
  • android
  • ios