బీహార్‌లో లిక్కర్ మాఫీయా రెచ్చిపోయింది. నాటు సారా స్థావరాలపై దాడులు చేసేందుకు వెళ్లిన పోలీసులపై తయారీదారులు తిరగబడ్డారు. పోలీసుల్ని పరిగెత్తించి, పరిగెత్తించి కొట్టారు. 

మద్యం మాఫియా ఒక మహిళా పోలీసును బలీ తీసుకుంది. బీహార్‌లో లిక్కర్ మాఫీయా రెచ్చిపోయింది. నాటు సారా స్థావరాలపై దాడులు చేసేందుకు వెళ్లిన పోలీసులపై తయారీదారులు తిరగబడ్డారు. పోలీసుల్ని పరిగెత్తించి, పరిగెత్తించి కొట్టారు. కర్రలతో విచక్షణారహితంగా విరుచుకుపడ్డారు. ప్రత్యేక బలగాలు వచ్చినా కూడా లాభం లేకుండాపోయింది. మహిళలు, చిన్నారులు వారిపై దాడి చేశారు. పోలీసుల వాహనాలను ధ్వంసం చేశారు. ఈ ఘటనలో మహిళా పోలీస్ ప్రాణాలు విడిచింది. పదుల సంఖ్యలో పోలీసులకు గాయాలయ్యాయి.