కరోనా ఎఫెక్ట్: లిప్‌స్టిక్ కొనడానికి భయపడే పరిస్ధితి

కరోనా వైరస్ మనిషిని పూర్తిగా మార్చేసింది. ఆ రంగం ఈ రంగం అని కాకుండా అన్ని రంగాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇప్పటికే పలువురు ఉద్యోగాలు కోల్పోవడంతో ఇకపై ఆడంబరాలకు దూరంగా ఉండాలని సగటు మనుషి నిర్ణయించుకున్నాడు

Lipstick effect revenge buying to drive Indian consumers faced with cash deficit post Coronavirus

కరోనా వైరస్ మనిషిని పూర్తిగా మార్చేసింది. ఆ రంగం ఈ రంగం అని కాకుండా అన్ని రంగాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇప్పటికే పలువురు ఉద్యోగాలు కోల్పోవడంతో ఇకపై ఆడంబరాలకు దూరంగా ఉండాలని సగటు మనుషి నిర్ణయించుకున్నాడు.

కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌‌ను ప్రకటించి రెండు నెలలు దాటింది. కుదేలైన ఆర్దిక వ్యవస్థను దారిలో పెట్టేందుకు కేంద్రం రూ.20 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించింది.

Also Read:ఆ చైనా కంపెనీలపై ఆంక్షల కొరడా: అవి ‘నిఘా‘ సంస్థలని అమెరికా మండిపాటు..

అంతేకాకుండా, ముందున్న వాటితో పోలిస్తే ప్రస్తుతం అమలులో ఉన్న లాక్‌డౌన్-4లో నిబంధనలను కాస్త సడలించారు. దీనితో ఆర్ధిక వ్యవస్థ మళ్లీ గాడిన పడనుందనే ఆశాభావాన్ని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో రానున్న కొద్దినెలల్లో కొనుగోళ్ల విషయంలో భారతీయుల వ్యవహారశైలి ఎలా ఉండనుంది అనే అంశంపై రెడ్ క్వాంటా అనే సంస్థ ఓ అధ్యయనం చేసింది. దీని ప్రకారం.. భారతీయులు అధిక ధరలున్న బ్రాండెడ్ వస్తువులను కొనటం తగ్గించి, తక్కువ ధరల్లో లభించే మన్నికైన వస్తువులకే ఓటేస్తారట.

Also Read:నో డౌట్..శాశ్వతంగా మూతే: టూరిజం కంపెనీలపై తేల్చేసిన బీఓటీటీ

లాక్‌డౌన్ కారణంగా తలెత్తిన ఆర్ధిక సంక్షోభం కారణంగా నగదు లభ్యత తగ్గటం భారతీయుల ఆలోచనా విధానాన్ని ప్రభావితం చేస్తుంది. ఉదాహరణకు మీరు ఖరీదైన లగ్జరీ హ్యాండ్ బ్యాగ్ వంటి బదులు, చిన్నదైన తక్కువ ధరకు లభించే నాణ్యమైన లిప్‌స్టిక్ వంటి వస్తువులను ఎంచుకుంటారని అధ్యయనంలో తేలింది.

దీనినే లిప్‌స్టిక్ ఎఫెక్ట్ అంటారని... పరిశోధకులు వివరించారు. ఈ ధోరణికి సరిపడే వస్తువులను తయారు చేసే కంపెనీలకు లాభసాటిగా ఉంటుందని చెప్పారు. ఆర్ధిక మాంద్యం వంటి పరిస్ధితుల్లో లిప్‌స్టిక్ ఎఫెక్ట్ అనివార్యమని పరిశోధకులు వెల్లడించారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios