New Delhi: ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ఐఎస్ సానుభూతిపరులపై కేరళ, తమిళనాడు, కర్ణాటకలోని 60 ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తోంది. కోయంబత్తూరు కారు సిలిండర్ పేలుడు కేసుకు సంబంధించి తమిళనాడులో ఈ సోదాలు జరిగాయని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
National Investigation Agency (NIA): వీడియోల ద్వారా తీవ్రవాదాన్ని వ్యాప్తి చేస్తున్న అనుమానిత ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ఐఎస్ సానుభూతిపరులకు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) తమిళనాడు, కేరళ, కర్ణాటకల్లోని 60 ప్రాంతాల్లో సోదాలు చేస్తోంది. కోయంబత్తూరు కారు సిలిండర్ పేలుడు కేసుకు సంబంధించి తమిళనాడులో ఈ సోదాలు జరిగాయి. కర్ణాటకలో 45కి పైగా చోట్ల యాంటీ టెర్రర్ ఏజెన్సీ దాడులు చేస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
వివరాల్లోకెళ్తే.. నిషేధిత ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ఐఎస్ తో సంబంధాలున్న అనుమానితుల కోసం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ ఐఏ) కర్ణాటక, తమిళనాడు, కేరళలోని 60 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తోంది.
గత ఏడాది తమిళనాడులోని కోయంబత్తూరు, కర్ణాటకలోని మంగళూరులో జరిగిన పేలుళ్లకు సంబంధించి సోదాలు కొనసాగుతున్నాయని దర్యాప్తు సంస్థకు చెందిన వర్గాలు వెల్లడించాయి. 2019లో కోయంబత్తూరులో జరిగిన పేలుడులో ఐఎస్‌ఐఎస్ సంబంధాలున్నాయనే ఆరోపణలపై కేంద్ర ఉగ్రవాద నిరోధక సంస్థ జమీజా ముబిన్ ను ప్రశ్నించినట్లు పోలీసులు తెలిపారు.
రెండు ఓపెన్ సిలిండర్లతో ముబిన్ డ్రైవింగ్ చేస్తుండగా అందులో ఒకటి పేలిపోయిందని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే పోలీసులు అతని నివాసాన్ని తనిఖీ చేయగా అక్కడ మరికొన్ని పేలుడు పదార్థాలు లభించాయి. దీంతో కేసు నమోదుచేసుకున్న వారు దీనిపై మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు. అక్కడ లభించిన పేలుడు పదర్థాల గురించి తమిళనాడు పోలీసు చీఫ్ సి.శైలేంద్రబాబు మాట్లాడుతూ.. మరిన్ని కుట్రలకు పాల్పడటానికి అనుగుణంగా పేలుడు పదర్థాలను నిందితులు సిద్ధం చేసుకున్నారని అన్నారు.
గత ఏడాది డిసెంబర్ లో ప్రధాన అనుమానితుడితో సహా ఇద్దరిని గాయపరిచిన మంగళూరు ఆటో రిక్షా పేలుడు కేసును ఎన్ఐఏ తన ఆధీనంలోకి తీసుకుంది. అప్పటి నంచి ఈ కేసు.. సంబంధిత అంశాలపై విచారణను వేగవంతం చేసింది. ఈ క్రమంలోనే ఉగ్రవాద సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో దేశంలోని అనేక ప్రాంతాల్లో తనిఖీలు చేస్తోంది.
గతేడాది సెప్టెంబర్ లో కూడా బాంబు తయారీకి ప్రయత్నించిన షరీక్ తక్కువ తీవ్రత కలిగిన ఇంప్రూవైజ్డ్ ఎక్స్ ప్లోజివ్ డివైజ్ లేదా ఐఈడీని తీసుకెళ్తుండగా అది పేలింది. ఆటో లోపల బ్యాటరీలు అమర్చిన ప్రెషర్ కుక్కర్ కాలిపోయినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఈ పేలుడు ప్రమాదవశాత్తూ జరిగినది కాదనీ, తీవ్ర నష్టం కలిగించే ఉద్దేశంతో జరిగిన ఉగ్రవాద చర్య అని కర్ణాటక పోలీసులు విచారన సందర్భంగా తెలిపారు.
పేలుడు తర్వాత దీని గురించి ఒక ఉగ్రవాద సంస్థ ప్రకటన చేయడంతో దర్యాప్తు ఏజెన్సీలు అప్రమత్తమయ్యాయి. ఆటో రిక్షా పేలుడుకు తామే బాధ్యులమని 'ఇస్లామిక్ రెసిస్టెన్స్ కౌన్సిల్' అనే ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. ఇంగ్లిష్ లో ప్రచురించిన ఒక ప్రకటనలో షరీఖ్ ఫోటోను ముద్రించి, మంగళూరులోని కాషాయ ఉగ్రవాదుల కంచుకోట అయిన కద్రిలోని హిందుత్వ ఆలయంపై దాడికి యత్నించినట్లు పేర్కొంది. అప్పటి నుంచి మరింత లోతైన విచారణ ఏన్ఐఏ అధికారులు జరుపుతున్నారు. ముఖ్యంగా, గత ఏడాది డిసెంబర్ లో మంగళూరు ఆటో రిక్షా పేలుడు కేసును ఎన్ఐఏ తన ఆధీనంలోకి తీసుకున్న తర్వాత పలు కీలక విషయాలు దర్యాప్తులో వెలుగులోకి వచ్చినట్టు సమాచారం. ఈ పేలుడు ఆకస్మికంగా జరగలేదని, తీవ్ర నష్టం కలిగించడానికి ఉద్దేశించిన ఉగ్రవాద చర్యగా గుర్తించారు.
