స్వలింగ సంపర్కానికి అంగీకరించేలదేని ఓ యువకుడు.. తన ప్రాణ మిత్రుడిని దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది. కాగా.. నిందితుడికి న్యాయస్తానం యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.

పూర్తి వివరాల్లోకి వెళితే...కడలూరు జిల్లా కోండూరుకు చెందిన సతీష్ కుమార్, దినేష్ లు ఇద్దరూ మిత్రులు. వీరిద్దరూ ఇంజినీరింగ్ పూర్తి చేసి ఓ కారు అమ్మకాల షోరూంలో పనిచేస్తున్నారు. కాగా.. 2016 ఏప్రిల్ 1వ తేదీన  ఆఫీసు ముగిసిన అనంతరం సతీష్ కుమార్,దినేష్ లు కలిసి మద్యం సేవించారు. ఆ సమయంలో తనతో స్వలింగ సంపర్కంలో పాల్గొనాలంటూ దినేష్.. సతీష్ ని ఒత్తిడి చేశాడు.

కాగా.. అందుకు సతీష్ నిరాకరించాడు. దీంతో.. కోపంతో ఊగిపోయిన దినేష్.. తన మిత్రుడు అని కూడా చూడకుండా సతీష్ ని హత్య చేశాడు. అనంతరం అతని శవాన్ని ఇంట్లోనే ఓ చోట గుంట తవ్వి పూడ్చేశాడు. అయితే.. ఉద్యోగానికి వెళ్లిన తమ కుమారుడు తిరిగి ఇంటికి రాలేదని కనిపించకుడాపోయాడని సతీష్ తండ్రి.. పోలీసులను ఆశ్రయించాడు.
 
అదృశ్యం కింద తొలుత కేసు నమోదు చేసుకున్న పోలీసులు పలువురిని విచారించగా.. దినేష్ పై అనుమానం కలిగింది. అతనిని నిలదీయగా.. తానే హత్య చేసినట్లు అంగీకరించాడు. ఈ కేసు  కడలూరు జిల్లా ఫస్ట్‌క్లాస్‌మేజిస్ట్రేటు కోర్టులో న్యాయమూర్తులు గోవిందరాజన్, తిలకవతి సమక్షంలో విచారణ ముగిసింది. నిందితుడు దినేష్‌కు యావజ్జీవశిక్ష విధిస్తున్నట్లు న్యాయమూర్తులు తాజాగా తీర్పు వెలువరించారు.