టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ- అనుష్క శర్మ దంపతులు తల్లిదండ్రులైన సంగతి తెలిసిందే. సోమవారం అనుష్క పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. కాగా.. వీరికి పుట్టిన బిడ్డ ఫోటో ఇదేనంటూ ఇటీవల సోషల్ మీడియాలో ఓ ఫోటో వైరల్ అవుతోంది. కాగా.. ఆ ఫోటో పై తాజాగా  విరాట్ కోహ్లీ సోదరుడు వికాస్ కోహ్లీ క్లారిటీ ఇచ్చారు.

ఇంతకీ మ్యాటరేంటంటే... విరుష్క జోడికి పాప పుట్టిందని తెలియగానే.. వికాస్ కోహ్లీ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ఓ చిన్నారి ఫోటో షేర్ చేశారు. కాగా.. ఆ ఫోటోనే అనుష్క విరాట్ కోహ్లీ దంపతుల గారాల పట్టి అంటూ అని అందరూ భావించారు.  అయితే.. దీనిపై తాజాగా వికాస్ కోహ్లీ స్పందించాడు.

అది విరుష్క జోడి కి పుట్టిన పాప ది కాదని.. వారికి శుభాకాంక్షలు చెప్పడానికి ర్యాండమ్ గా ఎంచుకున్న ఫోటో అని.. పాపది కాదని క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ఓ పోస్టు కూడా పెట్టారు. దీంతో.. ఆ ఫోటోకి సంబంధించిన రూమర్స్ కి చెక్ పడింది.

ఇదిలా ఉండగా.. ఇప్పటికే... కోహ్లీ తమకు పాప పుట్టిన ఆనందాన్ని పంచుకోవడంతోపాటు.. తమకు ప్రైవసీ కావాలంటూ పేర్కొన్నారు.