Asianet News TeluguAsianet News Telugu

బాబోయ్.. పిల్లిని వేటాడుతూ ఇంట్లోకి దూసుకొచ్చిన చిరుత.. అది చూసిన ఆ కుటుంబం ఏం చేసిందంటే...

ఓ రైతు తన భార్య, పిల్లలతో కలిసి రాత్రిపూట భోంచేస్తుంటే.. ఇంట్లోకి చిరుతపులి దూసుకువచ్చింది. దీంతో ఒక్కసారిగా షాక్ అయ్యారు. వెంటనే... 

Leopard runs into Junnar home during family dinner In pune
Author
First Published Nov 17, 2022, 11:57 AM IST

పూణె :  పూణేలో ఒళ్లు గగుర్పొడిచే ఘటన ఒకటి జరిగింది. జున్నార్‌లోని పింపాల్‌వాండికి చెందిన రాయ్‌కర్ల్ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి రాత్రిపూట డిన్నర్ చేస్తున్నారు. ఇంతలో ఓ పిల్లిని వేటాడుతూ పులి వారి ఇంట్లోకి దూసుకు వచ్చింది. దీంతో ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఓ పది నిమిషాల్లో పులి వారింట్లో నుంచి ఎలా వచ్చిందో అలా వెళ్లిపోయింది. కానీ వారిలో ఏర్పడ్డ వణుకు మాత్రం ఇంకా తగ్గలేదు. 

వృత్తిరీత్యా రైతు అయిన విలాస్ రాయ్కర్ ఈ సంఘటనను గుర్తుచేసుకోవడానికి ఇప్పటికీ వణుకుతున్నాడు. వెంటనే పులిని పట్టుకోవడానికి పంజరం ఏర్పాటు చేయాలని అటవీ శాఖను అభ్యర్థించాడు. పింపల్వాండి గ్రామం పూణే నుండి దాదాపు 90 కి.మీ దూరంలో ఉన్న జున్నార్ తహసీల్‌లోని ఓటూర్ అటవీ పరిధిలోకి వస్తుంది.

గువాహటిలో బిజీ ట్రాఫిక్ ను కంట్రోల్ చేసిన వీధి బాలుడు... వీడియో వైరల్.. పోలీసులు ఏం చేశారంటే...

దీని గురించి అతను చెబుతూ.. "నేను నా భార్య సంగీత, మా అబ్బాయి విక్రమ్‌తో కలిసి లివింగ్ రూమ్‌లో డిన్నర్ చేస్తున్నాను. అదే సమయంలో టీవీలో ఓ ప్రోగ్రాం చూస్తున్నాం. ఇంతలో ఓ పిల్లి మా వంటగదిలోకి పరుగెత్తుకు రావడం చూశాం. ఆ వెంటనే కొన్ని సెకన్లలో దానికి వెంటాడుతూ చిరుతపులి లోపలికి దూసుకు వచ్చింది. అది పిల్లివెంటపడుతూ మా ఇంట్లో పరుగులు పెట్టింది. మేము ఒక్కసారి షాక్ అయ్యి కేకలు వేశాం. అంతకంటే ఏమీ చేయలేకపోయాం..

ఆ తరువాత కొన్ని సెకన్లలోనే అది ఎలా వచ్చిందో అలాగే వెళ్లిపోయింది. కానీ.. మా భయం మాత్రం తగ్గలేదు. ఓ పదినిమిషాల్లో మేము మా ఇంటి తలుపులన్నీ మూసేసి ఇంట్లో వణుకుతూ ఉండిపోయాం. ఇంకా ఇంట్లో పులి తిరుగుతున్నట్లే ఉంది. రాత్రంతా బైటికి అడుగు అడుగు కూడా పెట్టలేదు" అని అతను చెప్పాడు.

రాయ్కర్ ఇంటి చుట్టూ చెరుకు తోటలు, ద్రాక్ష తోటలు ఉన్నాయి. అతని ఇంటికి కాంపౌండ్ వాల్ లేదు. ఇంటి బయట వెలుతురు కోసం కొన్ని విద్యుత్ బల్బులు పెట్టాడు. మా ఇంటి చుట్టుపక్కల ఉన్న పొలాల్లోకి చిరుతలు చొరబడతాయని తెలిసినా కాంపౌండ్‌ వాల్‌ కట్టుకునే స్థోమత మాకు లేదు. నాలాగే చాలా మంది రైతులు తమ ఇళ్ల చుట్టూ కాంపౌండ్‌ వాల్స్‌ వేసుకునే స్థోమత లేనివారే. ప్రభుత్వం దీనిని పరిశీలించి కాంఫౌండ్ వాల్ నిర్మాణం కోసం నిధులు కేటాయించాలి. చిరుతపులి దాడులను అరికట్టేందుకు కాంపౌండ్ వాల్స్‌ను నిర్మించాలని ఆయన అన్నారు.

రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్ వైభవ్ కక్డే దీనిమీద మాట్లాడుతూ.. చిరుతపులి దాడుల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై గ్రామస్తులతో పలు దఫాలుగా సమావేశాలు నిర్వహించామని, గ్రామంలో రాత్రిపూట పెట్రోలింగ్ పెంచాలని అధికారులకు సూచించామని అన్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం కాంపౌండ్ వాల్స్ నిర్మాణం కోసం ప్రజలకు నిధులు ఇవ్వడం లేదన్నారు."

Follow Us:
Download App:
  • android
  • ios