గ్రామంలోకి ప్రవేశించిన ఓ చిరుతపులి... కనిపించిన గ్రామస్థులందరిపై దాడి చేసింది. అటవీశాఖ అధికారులకు సమాచారం అందించినా వాళ్లు మాత్రం రాలేదు. దీంతో... ఇలా వదిలేస్తే.. చిరుత ప్రాణాలు తీసేస్తుందని భావించిన ఓ యువకుడు సాహసం చేశాడు. చిరుతను పట్టుకొని బంధించాడు. ఈ సంఘటన మధ్యప్రదేశ్ లోని మందసౌర్ జిల్లాలోని ఫతేపూర్ గ్రామంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... గ్రామంలోకి ఒక చిరుత ప్రవేశించి, స్థానికులపై దాడికి దిగుతూ భయకంపితులను చేసింది. ఆ చిరుత బారినపడిన 10మంది గాయాలపాలయ్యారు. ఈ విషయమై గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. అయితేవారు గ్రామానికి ఎంతకీ రాలేదు. దీంతోగ్రామానికి చెందిన ఫరీదీచంద్ అనే యువకుడు ఎంతో ధైర్యం చూపి, గ్రామస్తుల సాయంతో అతికష్టంమీద ఆ చిరుతను పట్టుకున్నాడు. తరువాత గ్రామస్తుల దాడిలో ఆ చిరుత మృతి చెందింది. ఇంతలో అక్కడకు వచ్చిన పోలీసులు చిరుత దాడిలో గాయపడినవారిని ఆసుపత్రికి తరలించారు.