Asianet News TeluguAsianet News Telugu

లాక్ డౌన్ ఎక్కువ ప్రాణాలు తీస్తుంది.. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి షాకింగ్ కామెంట్స్..

లాక్ డౌన్ మరికొద్దిరోజులు కొనసాగితే.. వైరస్ తో కన్నా.. ఆకలితో చనిపోయేవారి సంఖ్య దేశంలో ఎక్కువగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. కరోనాతో కలిసి జీవించడం నేర్చుకోవాలని ఆయన పేర్కొన్నారు.

Lengthy lockdown will kill more people than Covid: NR Narayana Murthy
Author
Hyderabad, First Published May 1, 2020, 8:18 AM IST

దేశంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. దీంతో.. వైరస్ ని అరికట్టేందుకు లాక్ డౌన్ విధించారు. ఇప్పటికే నెలన్నరకుపైగా దేశంలో లాక్ డౌన్ కొనసాగుతోంది. మరో రెండు రోజుల్లో అది ముగియనుండగా.. మళ్లీ పొడిగించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ క్రమంలో దీనిపై ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి స్పందించారు.

లాక్ డౌన్ మరికొద్దిరోజులు కొనసాగితే.. వైరస్ తో కన్నా.. ఆకలితో చనిపోయేవారి సంఖ్య దేశంలో ఎక్కువగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. కరోనాతో కలిసి జీవించడం నేర్చుకోవాలని ఆయన పేర్కొన్నారు.

భారత ఆర్థిక వ్యవస్థ కోలుకోవడానికి ఎంఎస్ఎంఈలకు, స్టార్టప్స్‌కు కేంద్ర ప్రభుత్వం గ్రాంట్స్ ఇవ్వాలని సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో బాధితులను రక్షిస్తూనే, సామర్థ్యం కలిగిన వారిని తిరిగి వర్క్ చేసేందుకు సిద్ధమవ్వాలన్నారు.

అభివృద్ధి దేశాలతో పోలిస్తే భారత దేశం పరిస్థితి బాగుందని నారాయణమూర్తి అన్నారు. మన వద్ద మరణాల రేటు 0.25 శాతం నుండి 0.5 శాతం మాత్రమే ఉందన్నారు. లాక్ డౌన్ కారణంగా ఇప్పటికే కరోనా వ్యాప్తిని చాలా వరకు నిరోధించామని చెప్పారు. 

వివిధ కారణాల వల్ల ఇండియాలో ప్రతి సంవత్సరం 90 లక్షల మంది మృత్యువాత పడుతున్నారని, ఇందులో నాలుగింట ఒక వంతు మంది కాలుష్యం వల్ల చనిపోతున్నారన్నారు. ప్రపంచంలోనే అత్యంత కలుషిత దేశాల్లో భారత్ ఒకటి అన్నారు.

ఏడాదిలో 9 మిలియన్ల మందితో పోలిస్తే ఈ రెండు నెలల్లో వెయ్యి మంది చనిపోయారని, ఇది అంత ఆందోళనకర విషయం కాదని మూర్తి అన్నారు. మన దేశంలో 190 మిలియన్ల మంది అసంఘటిత రంగం లేదా సెల్ఫ్ ఎంప్లాయిడ్‌గా ఉన్నారని గుర్తు చేశారు. ఇప్పుడు లాక్ డౌన్ ఇలాగే పొడిగించుకుంటూ వెళ్తే వీరు జీవనోపాధి కోల్పోయే అవకాశాలు ఉన్నాయన్నారు. ఎక్కువ కాలం కొనసాగితే ఎక్కువ మంది ఉపాధి కోల్పోతారన్నారు.


 

Follow Us:
Download App:
  • android
  • ios