Asianet News TeluguAsianet News Telugu

రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోబోం - బీఎస్పీ అధినేత్రి మాయావతి

తమ  పార్టీ సిద్ధాంతాలు ఇతర పార్టీల కంటే భిన్నంగా ఉన్నాయని బీఎస్పీ అధినేత్రి మాయావతి అన్నారు. వివిధ రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆమె ప్రకటించారు. 

BSP Chief Mayawati: We will not ally with any party in upcoming elections
Author
First Published Jan 15, 2023, 1:40 PM IST

రాబోయే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని, ఏ పార్టీతో పొత్తు పెట్టుకోబోమని బీఎస్పీ అధినేత్రి మాయావతి స్పష్టం చేశారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్‌లలో (ఈవీఎం)లో ఏదో లోపం ఉందని ఆరోపించారు. ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ ఓటింగ్ విధానాన్ని తిరిగి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆమె ఆదివారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.

పవిత్రమైన గంగా నదిపై క్రూయిజ్ పేరుతో బార్ నడిపిస్తున్నారు: బీజేపీ పై అఖిలేశ్ యాదవ్ తీవ్ర విమర్శలు

తన పార్టీ సిద్ధాంతాలు ఇతర పార్టీల కంటే భిన్నంగా ఉన్నాయని అన్నారు. అందుకే వివిధ రాష్ట్రాల్లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ ఏ పార్టీతో కలిసి పోటీ చేయదని ఆమె ప్రకటించారు. కాంగ్రెస్, ఇతర పార్టీలు బీఎస్పీతో పొత్తుకు ప్రయత్నిస్తున్నాయని ఆమె తెలిపారు. ‘‘రాబోయే ఎన్నికల్లో బీఎస్పీ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోదు. మేం సొంతంగానే పోటీ చేస్తాం. కాంగ్రెస్, మరికొన్ని పార్టీలు మాతో పొత్తు పెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయితే మా సిద్ధాంతం ఇతర పార్టీలకు భిన్నంగా ఉంది’’ అని అన్నారు.

‘‘ఈవీఎంలో ఏదో లోపం ఉంది. కొందరు దాన్ని దెబ్బతీస్తున్నారు. బ్యాలెట్ పేపర్ సమయంలో అన్ని ఎన్నికల్లోనూ మాకు సీట్ల సంఖ్య, ఓట్ల శాతం ఎక్కువగా ఉండేది. మళ్లీ బ్యాలెట్ పేపర్ తో ఎన్నికలు నిర్వహించాలి’’ అని మాయావతి డిమాండ్ చేశారు.

కన్నీటి సాగు.. ఒక్క మరఠ్వాడలోనే 2022లో 1,023 మంది రైతు ఆత్మహత్యలు

కాగా.. జనవరి 15న బీఎస్పీ అధినేత్రి మాయావతి 67వ జన్మదినాన్ని జనకల్యాంకరీ దివస్ గా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా లక్నోలోని మాల్ అవెన్యూలో ఉన్న పార్టీ రాష్ట్ర యూనిట్ కార్యాలయంలో కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా మాయావతి తన రచన ‘‘ ఎ ట్రావెలాగ్ ఆఫ్ మై స్ట్రగుల్-రిడెన్ లైఫ్ అండ్ బీఎస్‌పీ మూవ్‌మెంట్’’18వ ఎడిషన్ ను విడుదల చేయనున్నారు. పుట్టిన రోజు వేడుకల సందర్భంగా సోనూ నిగమ్, కైలాష్ ఖేర్, ఉదిత్ నారాయణ్, జావేద్ అలీ, ప్రిన్స్ ల పాటలను పార్టీ విడుదల చేసింది.

Follow Us:
Download App:
  • android
  • ios