Asianet News TeluguAsianet News Telugu

రాసలీలల వీడియో: యువతితో మంత్రి ఛాటింగ్ , వెలుగులోకి యడ్డీ అవినీతి..!!

కర్ణాటక జలవనరుల శాఖ మంత్రి రమేశ్‌ జర్కిహోలి రాసలీలల వీడియో కర్ణాటకతో పాటు దేశవ్యాప్తంగా  ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ ఆయన ఇప్పటికే రాజీనామా చేశారు. తాజాగా ఆ వీడియోలో వున్న యువతికి, మంత్రికి మధ్య జరిగిన ఛాటింగ్‌కు సంబంధించి కొన్ని మెసేజ్‌లు లీక్‌ అయ్యాయి

leaked chat jarkiholi said yediyurappa as corruptionist ksp
Author
bangalore, First Published Mar 3, 2021, 8:52 PM IST

కర్ణాటక జలవనరుల శాఖ మంత్రి రమేశ్‌ జర్కిహోలి రాసలీలల వీడియో కర్ణాటకతో పాటు దేశవ్యాప్తంగా  ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ ఆయన ఇప్పటికే రాజీనామా చేశారు.

తాజాగా ఆ వీడియోలో వున్న యువతికి, మంత్రికి మధ్య జరిగిన ఛాటింగ్‌కు సంబంధించి కొన్ని మెసేజ్‌లు లీక్‌ అయ్యాయి. దీనిలో రమేశ్‌ ..  కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్పపై సంచలన ఆరోపణలు చేశారు. యడ్డీ భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డాడరంటూ యువతికి చేసిన మెసేజ్‌‌లలో వ్యాఖ్యానించారు

యువతి: బెళగావిలో కన్నడ, మరాఠీ ప్రజలు బాగా కొట్టుకుంటున్నారు కదా?
రమేశ్‌ జర్కిహోలి: మరాఠీలు చాలా మంచి వారు. బెళగావిలో వున్న కన్నడిగులకు ఏం పని లేదు. 
రమేశ్‌ జర్కిహోలి: ప్రతిపక్షనేత సిద్దరామయ్య చాలా మంచి వాడు.. సీఎం యడియూరప్ప భారీగా అవినీతికి పాల్పడ్డాడు.
యువతి: మీరు ఢిల్లీకి వెళ్తున్నారు.. సీఎం అవుతారా?
రమేశ్‌ జర్కిహోలి: ప్రహ్లాద్‌ జోషి ముఖ్యమంత్రి అవుతారు... 

ఈ విధంగా సాగిన సంభాషణకు సంబంధించిన మెసేజ్‌లు ప్రస్తుతం కర్ణాటకలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. సాక్షాత్తూ తన కేబినెట్‌లోని మంత్రే యడ్డియూరప్పపై అవినీతి ఆరోపణలు చేయడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Also Read:కర్ణాటకలో సెక్స్ స్కాండల్: మంత్రి పదవికి రమేష్ రాజీనామా

దీనిపై కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్‌ స్పందించారు. ఇది కేవలం సెక్స్‌ స్కాండల్‌ వీడియో మాత్రమే కాదన్నారు. ఇందులో మంత్రి రమేశ్ .. ముఖ్యమంత్రి అవినీతి గురించి చెప్పారని, దీనికి యడ్డీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

మంత్రి చేసిన ఆరోపణల్ని అబద్దం అని నిరూపించాలని డీకే సవాల్ విసిరారు. ప్రస్తుత పరిస్ధితుల్లో బీజేపీ ఈ అంశంలో ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నామని శివకుమార్ పేర్కొన్నారు.  

కాగా, పౌరహక్కుల పోరాట సమితి అధ్యక్షుడు దినేశ్‌ కల్లహళ్లి మంత్రి రమేశ్ జర్కిహోలి రాసలీలలకు సంబంధించిన వీడియోలను బెంగళూరు నగర పోలీసు కమిషనర్‌ కమల్‌ పంత్‌కు అందజేశారు.

దీంతో మంత్రి గారి బూతు పురాణం వెలుగులోకి వచ్చింది. దీనిపై స్పందించిన రాష్ట్ర హోంమంత్రి బసవరాజ్‌ బొమ్మై .. జర్కిహోలిపై వచ్చిన ఆరోపణలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారని తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios