చెన్నై: సీఎం పదవిని ఎవరు చేపట్టాలనే విషయమై ఎఐఏడీఎంకే కార్యవర్గ సమావేశంలో పన్నీరు సెల్వం, పళని స్వామి వర్గాల మధ్య సోమవారం నాడు వాడివేడీ చర్చ సాగింది. ఈ విషయమై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే సమావేశం ముగిసింది. ఈ ఏడాది అక్టోబర్ మాసంలో నిర్వహించే సమావేశంలో ఈ విషయమై నిర్ణయం తీసుకోవాలని సమావేశం తీర్మానం చేసింది.

వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో సీఎం అభ్యర్ధి  ఎవరనే విషయం తేల్చలేదు. పళనిస్వామి, పన్నీరు సెల్వంలు ముఖ్యమంత్రి పదవిపై ఆశగా ఉన్నారు.

ఆగష్టు 15వ తేదీన ఈ విషయం వెలుగు చూసింది. ఇవాళ జరిగిన సమావేశం సీఎం ఎవరనే విషయాన్ని నిర్ణయం తీసుకోలేదు.  నాలుగు గంటలపాటు ఈ సమావేశం జరిగింది.ఈ సమావేశంలో ఎలాంటి  నిర్ణయం తీసుకోలేదు.యథాతథస్థితికి కట్టుబడి ఉండాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకొన్నారు.

ఈ ఏడాది అక్టోబర్ 7వ తేదీన నిర్వహించే సమావేశంలో ఎవరు సీఎం అభ్యర్ధి అనే విషయాన్ని నిర్ణయం తీసుకొంటామని పార్టీ సీనియర్ నేత కేపీ మునుస్వామి మీడియాకు చెప్పారు.

ఇవాళ జరిగిన సమావేశంలో పళనిస్వామి, పన్నీరు సెల్వం వర్గాలు తమనే సీఎం పదవిని కట్టబెట్టాలంటూ నినాదాలు చేశారు. ఇరు వర్గాల మధ్య హోరా హోరీగా పోరు నెలకొంది.

కొత్త వ్యవసాయ చట్టానికి వ్యతిరేకంగా రాష్ట్రంలోని డీఎంకేతో పాటు ఆ పార్టీ మిత్రపక్షాలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేస్తున్న సమయంలో ఏఐఏడీఎంకే ఈ సమావేశాన్నిఏర్పాటు చేసింది.