బంగ్లా అమ్మొద్దన్నందుకు భార్య హత్య.. నోయిడా లాయర్ హత్య కేసులో ట్విస్ట్...
నోయిడాలో కలకలం రేపిన లాయర్ రేణు సిన్హా హత్య కేసులో భర్తే నిందితుడని పోలీసులు తెలిపారు. అతడిని అదుపులోకి తీసుకున్నారు.

న్యూఢిల్లీ : నోయిడాలోని ఓ బంగ్లాలో 61 ఏళ్ల న్యాయవాదిని హత్య కేసులో పోలీసులు ఆమె భర్తను అరెస్టు చేశారు. నిందుతుడు, హతురాలి భర్త నితిన్ నాథ్ సిన్హా. భార్యను చంపిన తరువాత బంగ్లా స్టోర్ రూమ్‌లో 36 గంటలకు పైగా దాక్కున్నట్లు సమాచారం. పోలీసులు అతని ఫోన్‌ను ట్రాక్ చేసి పట్టుకున్నారు.
నోయిడా సెక్టార్ 30లోని వారి బంగ్లాలోని బాత్‌రూమ్‌లో సుప్రీంకోర్టు న్యాయవాది రేణు సిన్హా మృతదేహం శనివారం లభ్యమైంది. కొడుకు విదేశాల్లో ఉండగా ఆమె తన భర్తతో కలిసి అక్కడే ఉంటోంది. లాయర్ సోదరుడు తన సోదరికి రెండు రోజులుగా ఫోన్ చేస్తున్నాడు. కాగా, ఆమె ఫోన్ ఎత్తడం లేదు.
పెళ్లి చేసుకుంటానని చెప్పి.. నగ్న వీడియో కాల్ రికార్డు చేసి..
దీంతో అనుమానం వచ్చిన సోదరుడు పోలీసులకు సమాచారం అందించాడు. అతని సమాచారం మేరకు రేణు సిన్హా బంగ్లా వద్దకు చేరుకున్న పోలీసులు మహిళ మృతదేహాన్ని గుర్తించారు. ఆమె భర్త కనిపించకుండా పోయాడు. పోలీసులు సిన్హా ఫోన్‌ను ట్రాక్ చేశారు. అతని లాస్ట్ లొకేషన్ వారి ఇంటినే చూపిస్తుండడంతో పూర్తి స్థాయిలో జల్లెడ పట్టారు పోలీసులు.
చివరికి స్టోర్ రూంలో దాక్కున్న అతడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు రేణుసిన్హా సోదరుడు... తన సోదరిని ఆమె భర్తే హత్య చేశాడని ఆరోపించారు. తమ బంగ్లాను విక్రయించే విషయంలో భార్యాభర్తల మధ్య విభేదాలే న్యాయవాది హత్యకు కారణమని పోలీసులు తెలిపారు. నాథ్, ఆస్తిని విక్రయించాలని కోరుకున్నాడు. కాబోయే కొనుగోలుదారు నుండి టోకెన్ మొత్తాన్ని కూడా తీసుకున్నాడు. కానీ రేణు సిన్హా బంగ్లాను అమ్మేందుకు సిద్ధంగా లేరు. ఈ వివాదం భార్యాభర్తల మధ్య ఈ విషయంలో తరచూ గొడవలు జరుగుతుండేవని తెలిపారు పోలీసులు.